ఆలియా.. మరోసారి బ్యాక్ టు బ్యాక్ మూవీస్!
on Jul 6, 2022
ఈ ఏడాది ఆరంభంలో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో ఎంటర్టైన్ చేసింది బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్. ఫిబ్రవరి 25న `గంగూబాయి కథియావాడి`తోనూ, మార్చి 25న `ఆర్ ఆర్ ఆర్`తోనూ పలకరించి.. రెండు మెమరబుల్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది. కట్ చేస్తే.. ఈ క్యాలెండర్ ఇయర్ సెకండాఫ్ లోనూ రెండు వరుస నెలల్లో కొత్త చిత్రాలతో సందడి చేయనుంది ఈ టాలెంటెడ్ యాక్ట్రస్.
ఆ వివరాల్లోకి వెళితే.. డెబ్యూ డైరెక్టర్ జస్మీత్ కె. రీన్ నిర్దేశకత్వంలో ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ కామెడీ డ్రామా `డార్లింగ్స్`. గౌరీ ఖాన్, గౌరవ్ వర్మతో కలిసి ఆలియా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 5న ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో నేరుగా స్ట్రీమ్ కానుంది. మరోవైపు.. తన భర్త రణ్ బీర్ కపూర్ తో కలిసి నటించిన `బ్రహ్మాస్త్ర - పార్ట్ వన్ శివ` సెప్టెంబర్ 9న థియేటర్స్ లోకి రానుంది. అమితాబ్ బచ్చన్, నాగార్జున వంటి సీనియర్ స్టార్స్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అయన్ ముఖర్జీ దర్శకుడు. కరణ్ జోహార్, అయన్ ముఖర్జీ, రణ్ బీర్ కపూర్, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా, మరిజ్కే డిసౌజా ఈ ఫాంటసీ అడ్బెంచర్ ఫిల్మ్ కి నిర్మాతలు. మరి.. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సందడి చేయనున్న ఈ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో ఆలియా ఎలాంటి గుర్తింపుని, ఫలితాలను పొందుతుందో చూడాలి.