Home

»

Bollywood News

Alpha First Review: అలియా భట్ 'ఆల్ఫా' మూవీ ఫస్ట్ రివ్యూ

Jul 1, 2026 5:17PM

బాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ స్పై యూనివర్స్ చిత్రం 'ఆల్ఫా' (Alpha) థియేటర్లలోకి రావడానికి సర్వం సిద్ధమైంది. అలియా భట్ (Alia Bhatt), శర్వారీ వాఘ్ (Sharvari Wagh) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా విడుదలకు ముందు కీలకమైన సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి కొన్ని కీలక మార్పులతో 'UA 16+' సర్టిఫికేట్‌ను మంజూరు చేసింది. అంటే 16 ఏళ్ల లోపు వారు తమ తల్లిదండ్రుల సమక్షంలో ఈ సినిమాను వీక్షించవచ్చని బోర్డు స్పష్టం చేసింది. సినిమా కథాంశం తీవ్రమైన ప్రతీకార రగిలే నేపథ్యంతో సాగడం, భారీ యాక్షన్ సీక్వెన్సులు ఉండటమే దీనికి ప్రధాన కారణం.

సెన్సార్ బోర్డ్ నివేదిక ప్రకారం, ఈ చిత్రం మొత్తం రన్‌టైమ్ 140 నిమిషాల 48 సెకన్లు (సుమారు 2 గంటల 20 నిమిషాలు) గా నిర్ధారించబడింది. ప్రేక్షకులు సీటు అంచున కూర్చునేలా చేసేలా ఈ రన్‌టైమ్‌ను పక్కాగా లాక్ చేశారు. అయితే, సినిమాలో కొన్ని హింసాత్మక దృశ్యాలపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యంగా సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే 'మల్టిపుల్ స్టాబింగ్' (కత్తులతో పదే పదే పొడిచే) విజువల్స్ తీవ్రతను తగ్గించాలని మేకర్స్‌ను ఆదేశించింది. ఆ సీన్ల స్థానంలో ప్రత్యామ్నాయ షాట్లను రీప్లేస్ చేశారు. అలాగే, ఫస్ట్ హాఫ్ లో ఉన్న కొన్ని బూతు పదాలను మ్యూట్ చేయించారు.

ఈ సెన్సార్ రిపోర్ట్ ద్వారా సినిమా అసలు కథేంటో కూడా బయటకు వచ్చింది. 'ఆల్ఫా' చిత్రంలో అలియా భట్ 'సీత' అనే పవర్ ఫుల్ పాత్రలో నటిస్తోంది. ప్రతీకారేచ్ఛతో రగిలిపోయే ఒక యువతి, తన లక్ష్య సాధనలో అడ్డువచ్చిన వారిని ఎలా అంతమొందించింది అనేదే ఈ సినిమా మూల కథ. తనను ఒక ఆయుధంగా మార్చిన బాబీ డియోల్ (ఫతే) సామ్రాజ్యాన్ని కూల్చడానికి సీత బయలుదేరుతుంది. ఈ క్రమంలో దుర్గ (శర్వారీ) ఆమెతో ఎలా చేతులు కలిపింది, వారిద్దరూ కలిసి ఈ ప్రమాదకరమైన మిషన్‌ను ఎలా పూర్తి చేశారనేది ఆసక్తికరం. ఓవరాల్ గా సినిమా అవుట్ పుట్ బాగుందని, ముఖ్యంగా యాక్షన్ లవర్స్ కి నచ్చుతుందని అంటున్నారు.

ఇది యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) స్పై యూనివర్స్ లో వస్తున్న చిత్రం కాగా, ఇద్దరు మహిళా ఏజెంట్లు లీడ్ రోల్స్ లో వస్తున్న మొదటి లేడీ-ఓరియెంటెడ్ స్పై ఫిల్మ్ కావడం విశేషం. శివ్ రావల్ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపిస్తుండగా, హృతిక్ రోషన్ (మేజర్ కబీర్) సర్ప్రైజ్ కామియో రోల్‌లో మెరవనున్నారు. సినిమా జూలై 3న రిలీజ్ కాబోతోంది. 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com