అక్షయ్ కుమార్ పారితోషికం ఎంతో తెలుసా?
on Jan 24, 2023
అక్షయ్ కుమార్ పారితోషికం ఎంత తీసుకుంటారు? 50 కోట్లు తీసుకుంటారా? 100 కోట్లు తీసుకుంటారా? అసలు సినిమాకు ఎంత ఛార్జ్ చేస్తారు? ఎన్ని రోజులు కాల్ షీట్లు కేటాయించాం అనేదాన్ని బట్టి ఆయన పారితోషికం డిమాండ్ చేస్తారా? ఇలాంటి విషయాలు ఫాన్స్ కి ఎప్పుడూ ఆసక్తి కలిగిస్తూనే ఉంటాయి. లేటెస్ట్ గా అక్షయ్ కుమార్ తన సినిమా సెల్ఫీని ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేదిక మీద అక్షయ్ కుమార్ తన పారితోషికం గురించి మాట్లాడారు. ఎప్పటికప్పుడు సరదా సంభాషణలతో, విట్టీ ఆన్సర్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు అక్షయ్ కుమార్.
ఆయన లేటెస్ట్ గా నటించిన సినిమా సెల్ఫీ. ఈ సినిమా కోసం ఆయన 50 నుంచి 100 కోట్ల మధ్య చార్జ్ చేశారన్నది వైరల్ అవుతున్న వార్త. రిపోర్టర్ దీని గురించి అడగగా, అక్షయ్ స్పందిస్తూ ``నేనెప్పుడూ పాజిటివ్ గానే స్పందిస్తాను. కానీ నా స్పందనకు మీరు ఎలా స్పందిస్తారు అన్నదే ఇక్కడ విషయం`` అని చమత్కరించారు. ``మీరు షేర్వానీ వేసుకున్నందుకు ప్రాబ్లంగా ఉందా? అని నేను అడిగితే... మీకు ఎలా అనిపిస్తుంది? సరదాగా మాట్లాడుకుంటున్న ప్రతిసారీ, పాజిటివ్‌గా మాట్లాడుకుంటున్న ప్రతిసారీ మన మనసులు హాయిగా ఉంటాయి కదా! అలాగే మీరు ఏం మాట్లాడినా మీతో సంభాషించే ప్రతి మాటా, నా మనసుకు హాయి కలిగించేలా ఉండాలని భావిస్తున్నాను`` అని అన్నారు.
ఆయన నటించిన సెల్ఫీ సినిమా ఫిబ్రవరి 24న విడుదల కానుంది. సెల్ఫీ సినిమాలో ఇమ్రాన్ హష్మీ, నష్రత్ కీలక పాత్రలో నటించారు. గుడ్ న్యూస్ ఫేమ్ రాజ్ దర్శకత్వం వహించిన చిత్రమిది. రామ్ సేతు తర్వాత అక్షయ్ కుమార్ కెరీర్‌లో విడుదలవుతున్న సెల్ఫీ మీద సౌత్ లోనూ మంచి హోప్సే ఉన్నాయి

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
