'బచ్చన్ పాండే'గా భయపెడుతున్న అక్షయ్ కుమార్!
on Feb 15, 2022

అక్షయ్ కుమార్ మెయిన్ లీడ్‌గా చేస్తోన్న 'బచ్చన్ పాండే' మూవీ 2022 మార్చి 18న విడుదలవుతోంది. ఈ మూవీలో కృతి సనన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అర్షద్ వార్సి కీలక పాత్రధారులు. తమిళ హిట్ ఫిల్మ్ 'జిగర్తాండ' (తెలుగులో 'గద్దలకొండ గణేష్')కు ఇది రీమేక్. అక్షయ్ ఈ మూవీలో గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నాడు. ఈరోజు తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా కొత్త పోస్టర్‌ను షేర్ చేసిన అక్షయ్, ట్రైలర్ రిలీజ్ డేట్‌ను రివీల్ చేశాడు. ఆ పోస్టర్‌లో భీతికొలిపే రూపంతో ఆయన కనిపిస్తున్నాడు. ఆయన కంటి మేకప్ భయపెట్టేవిధంగా ఉంది. ఈ క్యారెక్టర్‌తో తాను జనాన్ని భయపెడతానని పోస్టర్‌కు క్యాప్షన్ పెట్టాడు అక్షయ్.
ఈ ఒక్క క్యారెక్టర్ పెయింట్ షాప్ కంటే మించి ఎక్కువ షేడ్స్‌తో ఉంటుంది. "#BachchhanPaandey ఆప్‌కో డరానే, హసానే, రులానే సబ్ కే లియే రెడీ హై. మీ ప్రేమనంతా అతనికి ఇవ్వండి. 2022 ఫిబ్రవరి 18న ట్రైలర్ విడుదలవుతుంది." అని ఆయన ట్వీట్ చేశాడు.
ఫ్యాన్స్‌కు మాత్రం అక్షయ్ లుక్ బాగా నచ్చినట్లు కనిపిస్తోంది. పలువురు ఫ్యాన్స్ ఇది ఆయన బెస్ట్ లుక్ అన్నట్లు కామెంట్లు పెట్టారు. "క్యా లుక్ హై. మజా ఆ జాయేగా" అని రాసుకొచ్చారు. 2021లోనే ఈ సినిమా విడుదల కావాల్సి వుండగా, మహమ్మారి కారణంగా వాయిదాపడింది. ఈ సినిమాకు ఫరద్ సామ్జీ దర్శకుడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



