Home

»

Bollywood News

Akshay Kumar: అక్షయ్‌ కుమార్‌ కుమార్తెపై వేధింపుల కేసు.. నిందితుడి అరెస్ట్‌!

Apr 25, 2026

- అక్షయ్ కుమార్ కుమార్తెను వేధించిన వ్యక్తి అరెస్ట్
- ఆన్‌లైన్ గేమ్ ఆడుతున్న సమయంలో అసభ్యకర మెసేజ్‌లు
- న్యూడ్ ఫోటోలు పంపాలంటూ వేధింపులు
- అక్షయ్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) కుమార్తె సైబర్ వేధింపులకు గురైన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిని మహారాష్ట్ర సైబర్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. 

గతేడాది అక్టోబర్‌లో ముంబైలో జరిగిన 'సైబర్ అవేర్‌నెస్ మంత్ 2025' కార్యక్రమంలో అక్షయ్ కుమార్ పాల్గొన్నప్పుడు.. ఈ చేదు అనుభవాన్ని పంచుకున్నారు. తన కుమార్తె ఆన్‌లైన్‌లో గేమ్‌ ఆడుతున్న సమయంలో ఒక అపరిచితుడి నుంచి అసభ్యకరమైన మెసేజ్‌లు వచ్చాయని, న్యూడ్ ఫోటోలు పంపాలంటూ సదరు వ్యక్తి వేధించాడని అక్షయ్ తెలిపారు.

ఈ విషయాన్ని అక్షయ్ కుమార్తె వెంటనే తల్లిదండ్రులు దృష్టికి తీసుకెళ్లింది. దాంతో ఈ ఘటనపై అక్షయ్ స్వయంగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్షయ్ కుమార్తె ధైర్యంగా ఈ విషయాన్ని బయటపెట్టడం వల్లే నిందితుడిని పట్టుకోవడం సాధ్యమైందని పోలీసులు ప్రశంసించారు. 

ఈ చేదు అనుభవం తర్వాత అక్షయ్ కుమార్ ఒక కీలక ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచారు. పాఠశాల విద్యార్థులకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించేందుకు 'సైబర్ ఎడ్యుకేషన్'ను ఒక సబ్జెక్టుగా చేర్చాలని అక్షయ్ కుమార్ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

సైబర్ నేరాల పట్ల పిల్లలు జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటివి జరిగినప్పుడు తల్లిదండ్రులకు చెప్పాలని పోలీసులు సూచిస్తున్నారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com