Home

»

Bollywood News

కొత్త పెళ్ళికొడుకు అమీర్ ఖాన్ కి ప్రాణహాని.. ఎవరి నుంచో తెలిస్తే షాక్ అవుతారు

Jul 18, 2026 11:09AM

 


భారతీయ సినీ పరిశ్రమ ఎనీ టైం సగర్వంగా చెప్పుకునే నటుల్లో అమీర్ ఖాన్(Ameer Khan)ఒకడు. నాలుగు దశాబ్డల పై నుంచి నటన విషయంలో సత్తా చాటుతూ జేన్ జీ బ్యాచ్ ని సైతం తన అభిమానులుగా మార్చుకున్నాడు.మిస్టర్ పర్ఫెక్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ కూడా. కొన్ని రోజుల క్రితం సుదీర్ఘ కాలం నుంచి  తన స్నేహితురాలిగా ఉన్న గౌరి స్ప్రాట్ ని వివాహం చేసుకొని కొత్త లైఫ్ ని స్టార్ట్ చేసాడు.  

ఇన్ని రోజులు స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ని  టార్గెట్ చేసిన కుప్రసిద్ధ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్, ఇప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్‌ను తమ తదుపరి లక్ష్యంగా ఎంచుకుంది. ఈ గ్యాంగ్‌కి  చెందిన కీలక సభ్యులు ఆర్జూ బిష్ణోయ్, టైసన్ బిష్ణోయ్ సోషల్ మీడియా వేదికగా ఒక ఆడియో క్లిప్, సుదీర్ఘమైన పోస్ట్‌ షేర్ చేసారు. సదరు పోస్ట్ లో 'గౌరీ స్ప్రాట్‌ తో పెళ్లి  లవ్ జిహాద్. తమ సంస్కృతి సాంప్రదాయాలపై ఇది ముమ్మాటికీ దాడి. ఇలాంటి చర్యలని  తాము ఎంతమాత్రం సహించం. సినిమా స్టార్‌డమ్‌ను అడ్డం పెట్టుకుని దేశంలో లవ్ జిహాద్‌ను ప్రోత్సహించే వారి ఊపిరి ఆపేస్తామంటూ "చోక్ ద బ్రీత్" (Choke the breath) అనే అత్యంత భయంకరమైన పదజాలాన్ని ఉపయోగించింది. దీంతో  ముంబై మరియు ఢిల్లీ పోలీసు వర్గాలు ఉలిక్కిపాటుకి గురవుతున్నారు.


Also read: ఆదిత్యధర్ నెక్స్ట్ మూవీ.. ఆ ప్రాంత వీరుడి కథతోనేనా! 

అమీర్ ఖాన్ గతంలోనే ఈ వివాదాలపై స్పందిస్తూ, తన వివాహం కేవలం స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద మాత్రమే జరిగిందని, ఇందులో ఎలాంటి మత మార్పిడులు లేవని స్పష్టం చేసినప్పటికీ, బిష్ణోయ్ గ్యాంగ్ మాత్రం దీనిని సీరియస్‌గా తీసుకుని హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. 

aamir khan, gauri sprtt, bishnoi gang,
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com