త్రీ ఇడియట్స్ కి సీక్వల్ సిద్ధమవుతోందా?
on Feb 3, 2023
త్రీ ఇడియట్స్ కి సీక్వెల్స్ సిద్ధమవుతుందా? ఇప్పుడు బాలీవుడ్లో నెటిజన్లు ఈ ప్రశ్నను తెగ వైరల్ చేస్తున్నారు. ఆమిర్‌ఖాన్, షర్మన్ జోషి, ఆర్ మాధవన్ హీరోలుగా నటించిన సినిమా త్రీ ఇడియట్స్. కాలేజీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అప్పటిదాకా రీమేకులు చేయని శంకర్... త్రీ ఇడియట్స్ ని తమిళ్లో రీమేక్ కూడా చేశారు. అంతగా నార్త్ సౌత్ అన్న తేడా లేకుండా అందరినీ ఆకట్టుకున్న సినిమా త్రీ ఇడియట్స్. ఈ సినిమాకు సీక్వెల్ కావాలని లేటెస్ట్ గా ట్విట్టర్లో ట్రెండ్ షురూ చేశారు.
ఇంతకీ విషయం ఏమిటంటే త్రీ ఇడియట్స్ హీరోలు ముగ్గురిలో ఒకరైన షర్మన్ జోషి నటించిన కంగ్రాట్యులేషన్స్ సినిమా ఇవాళ విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా షర్మన్ ఓ వీడియో చేస్తుండగా ఆ వీడియో లోకి ఎంట్రీ ఇచ్చారు మాధవన్. కంగ్రాజులేషన్స్ అనగానే థ్యాంక్స్ అంటూ చెప్పారు మాధవన్. నీకు చెప్పింది కాదు అది... నా సినిమా ఇవాళ విడుదలవుతుందంటూ షర్మన్ అన్నారు. వీళ్లిద్దరు ఇలా కాన్వర్జేషన్ కొనసాగిస్తుండగా వీడియో లోకి ఎంట్రీ ఇచ్చేశారు ఆమీర్ ఖాన్.
ఈ ముగ్గురిని ఒకచోట చూసిన ప్రేక్షకులు 3 ఇడియట్స్ కి సీక్వెల్ కావాలంటూ అడుగుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఏ వివరాలనూ ఆ ముగ్గురు యువ్వకపోయినప్పటికీ ఆ ముగ్గురుని ఇలా ఒకేచోట చూడటం మాత్రం కన్నుల పండుగలా ఉంది అంటున్నారు ఫాన్స్. అప్పట్లో త్రీ ఇడియట్స్ ని ఫ్రెండ్స్ తో కలిసి చూసిన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉన్నారు. ఆమిర్‌ఖాన్ ప్రస్తుతం ఓ స్పానిష్ సినిమాను రీమేక్ చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమాలో హీరోగా సల్మాన్ ఖాన్ నటిస్తారని వినికిడి. ముందు ఈ సినిమాలో తానే హీరోగా చేయాలనుకున్నారు మిస్టర్ పర్ఫెక్ట్. కాకపోతే, లాల్‌సింగ్ ఫ్లాప్ కావడంతో తాను నిర్మాతగా మాత్రమే ఉంటూ, సల్మాన్ ఖాన్ని హీరోగా పెట్టి ఈ సినిమా తీయడానికి నిర్ణయించారు ఆమిర్.