English | Telugu

వాడు నా కూతురిని పొట్టన పెట్టుకున్నాడు.. అలిగి వెళ్ళిపోయిన రామ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -341 లో....సీతాకాంత్ వెళ్తుంటే దారిలో కార్ ఆగిపోతుంది. ఇప్పుడు అర్జెంట్ గా వెళ్ళాలి ఎలా ఏదైనా లిఫ్ట్ అడుగుదామనుకుంటాడు. అప్పుడే రామలక్ష్మి కార్ అటుగా వస్తుంది. దాంతో ఆ కార్ అపి లోపల కూర్చుంటాడు సీతాకాంత్. వెనకాల రామలక్ష్మిని చూసి ఆశ్చర్యపోతాడు. స్కూల్ కి వచ్చి నిన్ను చూసే అవకాశం ఈ రోజు లేదని.. నిన్నే ఇలా కన్పించేలా చేసాడు ఆ దేవుడు అని సీతాకాంత్ అంటాడు. ఇప్పుడు సీతా సర్ కి లిఫ్ట్ ఇవ్వకపోతే నేనే రామలక్ష్మిని అని తెలుస్తుందని రామలక్ష్మి లిఫ్ట్ ఇస్తుంది.

వెళ్తు దారిలో అక్కడ టీ తాగి వెళదామా అని సీతాకాంత్ అడుగుతాడు. వద్దని రామలక్ష్మి అంటుంది. వస్తే నువ్వే రామలక్ష్మివి అని బయటపడతావని భయమా అని సీతాకాంత్ అనగా.. అంత లేదని టీ స్టాల్ దగ్గర ఆగి ఇద్దరు టీ తాగుతారు. పక్కన పెద్దావిడ వెళ్తుంటే.. బస్తీ లోని బామ్మ అని సీతాకాంత్ తన దగ్గరికి వెళ్తాడు. నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావని పెద్దావిడ అంటుంది. మీరేం చెసిన నేను బయటపడనని రామలక్ష్మి అనుకుంటుంది.

మరొకవైపు రామ్ కి శ్రీవల్లి భోజనం తినిపిస్తుంది. రామ్ కి వాటర్ ఇవ్వమని శ్రీలతని శ్రీవల్లి అడుగుతుంటే.. వాడేమైన చిన్న పిల్లాడా అంటూ తను కోప్పడుతుంది. దాంతో నిన్ను ఏమైనా వాటర్ అడిగానా అంటూ రామ్ కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఏంటి అత్తయ్య అలా అన్నారని శ్రీవల్లి అనగానే.. వాడు నా కూతురిని పొట్టన పెట్టుకున్నాడు. నాకు ఆ బాధ ఉంటుంది కానీ సీతా కోసం బయటపడనని శ్రీలత అంటుంది. ఆ తర్వాత సీతాకాంత్ ఇంటికి వస్తాడు నాన్న నీతో ఒక విషయం చెప్పాలి. ఈ మధ్య మిస్ నాతో డిఫరెంట్ గా ఉంటుంది. నీలా యాక్టింగ్ చేసినందుకు బాగా చేసావంటూ మెచ్చుకుంది. ఎందుకు అలా చేసింది. నాకు అర్ధం కాలేదని రామ్ అనగానే నాకు తెలుసని సీతాకాంత్ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.