English | Telugu
వాళ్ళిద్దరికి అలా జరిగిందని రిషి తెలుసుకుంటాడా?
Updated : Sep 10, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -864 లో.. ఏంజెల్ విశ్వనాథ్ ఇద్దరు రిషికి ఇష్టం లేకున్నా పెళ్లి గురించి మాట్లాడేసరికి.. అదే ఆలోచిస్తూ రిషికి ఇంటికి వెళ్ళాలని అనిపించదు. దాంతో ఇంటికి వెళ్లకుండా ఒక దగ్గర కూర్చొని వసుధారతో మాట్లాడుతుంటాడు. అప్పుడే విశ్వనాథ్ ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తాడు. నా వర్క్ అయ్యాక వస్తానని రిషి చెప్తాడు. ఇప్పుడేం చెయ్యాలి వసుధార అని రిషి అంటాడు. పెళ్లి ఇష్టం లేదని చెప్పండి అని వసుధార అనగానే.. విశ్వనాథ్ గారి హెల్త్ బాగుండదని రిషి అంటాడు. అయితే పెళ్లికి ఒప్పుకొండని వసుధార అనగానే రిషి కోపంగా ఇక్కడ నుండి వెళ్ళు వసుధార అని అంటాడు.
ఆ తర్వాత మీరు నాతో పాటు రానిదే నేను ఇక్కడ నుండి వెళ్ళనని వసుధార అంటుంది. రిషి వెళ్ళమని చెప్తాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక వసుధారకి మహేంద్ర ఫోన్ చేస్తాడు. విశ్వనాథ్ మాకు ఫోన్ చేసి చెప్పిన విషయం నిజమేనా అని అడుగుతాడు. ఏ విషయమని మహేంద్రని వసుధార అడుగుతుంది. ఏంజిల్, రిషిల పెళ్లి గురించి అని మహేంద్ర చెప్తాడు. అవునని వసుధార చెప్తుంది. దానికి రిషి ఒప్పుకున్నాడా అని మహేంద్ర అడుగుతాడు. లేదు సర్ రిషి సర్ కీ ఇష్టమే అన్న భ్రమలో ఉన్నారు. రిషి సార్ విశ్వనాథ్ సర్ ఆరోగ్యం గురించి అలోచించి ఇష్టం లేదని చెప్పట్లేదని వసుధార చెప్తుంది. మీరేం టెన్షన్ పడకండి. మేం మీ దగ్గరికి వస్తున్నాం.. ఎలాగైనా ఆ పెళ్లి ఆపేస్తామని వసుధారకి మహేంద్ర చెప్తాడు. మరొకవైపు శైలేంద్ర ఒక రౌడీని కలిసి మాట్లాడుతాడు. మీరు చెప్పినట్టే వాళ్ళు వెళ్తున్న కార్ బ్రేక్ లు ఫెయిల్ చేశామని రౌడీ చెప్తాడు. సరే వాళ్ళని ఫాలో అవ్వమని శైలేంద్ర చెప్తాడు. మరొక వైపు వసుధార, రిషిలకి ఈ దూరమేంటని చక్రపాణి బాధపడతాడు. నేను వెళ్లి నీ గురించి రిషి గురించి విశ్వనాథ్ సర్ కి చెప్తానని చక్రపాణి అనగానే.. వద్దు జగతి మేడమ్ మహేంద్ర సర్ లు ఇక్కడికి వస్తున్నారంట.. వాళ్ళు ఈ పెళ్లి జరగకుండా చేస్తామని చెప్పారని చక్రపాణికి వసుధార చెప్తుంది. మరొక వైపు జగతి, మహేంద్ర ఇద్దరు వెళ్తున్న కార్ బ్రేక్ లు పని చెయ్యవ్ దాంతో కార్ బ్రేక్ లు పడక ఒక దానికి తాకుతుంది. అది చూసిన రౌడీ శైలేంద్రకి చెప్పాలని అనుకుంటాడు. ఆ తర్వాత కొంతమంది వచ్చి జగతి, మహేంద్రలకి స్పృహ వచ్చేలా చేస్తారు.
ఆ తర్వాత స్పృహలోకి వచ్చిన వాళ్ళు.. వసుధారకి తన ఫోన్ నుండి కాల్ చెయ్యమని జగతి ఒక అతనికి చెప్పగానే.. వసుధారకి ఫోన్ చేసి.. జగతి మహేంద్రలకి దెబ్బ తాకిన విషయం చెప్తాడు. అది విన్న వసుధార టెన్షన్ పడుతు వస్తున్నా అని చెప్తుంది. ఆ విషయం చెబ్దామని రిషికి ఫోన్ చేసిన రిషి ఫోన్ లిఫ్ట్ చెయ్యడు. మరొక వైపు తెల్లవారిన రిషి ఇంటికి రాలేదని ఏంజిల్, విశ్వనాథ్ ఇద్దరు రిషికి ఫోన్ చేస్తుంటారు. అయిన రిషి చూసి కూడా లిఫ్ట్ చెయ్యడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.