Read more!

English | Telugu

విష్ణుప్రియ ఇంట్లో విషాదం!

యూట్యూబర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన విష్ణుప్రియ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. యాంకర్ గా ఒక వైపు మరో వైపు హీరోయిన్ గా సక్సెస్ సాధిస్తోంది. 

ఇప్పుడు యాంకర్ విష్ణుప్రియ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె కన్నతల్లి ఇటీవల తుదిశ్వాస విడిచినట్లు తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. తన తల్లితో కలిసున్న ఫొటో షేర్ చేస్తూ ఎమోషనల్  అయ్యింది. తన పోస్టులో.. “మై డియర్ అమ్మ.. ఇవాళ్టి వరకు నాకు తోడుగా ఉన్నందుకు నీకు ధన్యవాదాలు. నా చివరి శ్వాస వరకు నీ పేరు నిలబెట్టడానికే కృషి చేస్తాను. నువ్వే  నా బలం,  నా బలహీనత. ఇప్పుడు నన్ను విడిచి నువ్వు వెళ్ళిపోయావు. నా ప్రతి శ్వాసలో నువ్వుంటావని నాకు తెలుసు. ఈ భూమ్మీద నాకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావు. నేను నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. రెస్ట్ ఇన్ పీస్ అమ్మా..” అంటూ విష్ణుప్రియ తన ఉద్వేగాన్ని ఇలా షేర్ చేసుకుంది. విషయం తెలుసుకున్న బుల్లితెర కమెడియన్లు, యాంకర్లు తనను ఓదారుస్తున్నారు. 

ఇకపోతే సోషల్ మీడియాలో  విష్ణుప్రియ- జబర్దస్త్ రీతూచౌదరి చాలా మంచి ఫ్రెండ్స్ అన్న విషయం  అందరికీ తెలిసిందే. ఇటీవలే వాళ్లిద్దరూ కలిసి వెకేషన్ కి కూడా వెళ్లొచ్చారు. ఇటీవలే రీతూ చౌదరి వాళ్ల నాన్న కాలం చేశారు. ఇప్పుడు  విష్ణుప్రియ వాళ్ల అమ్మ తుదిశ్వాస విడిచారు. రోజుల వ్యవధిలోనే ఫ్రెండ్స్ ఇద్దరి ఇళ్లల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.