English | Telugu

నన్ను ఒకవైపే చూశారు.. ఇకపై నేనేంటో చూపిస్తా!

బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయిన వారిలో అందంతో పేరుతెచ్చుకున్న వాళ్ళు తక్కువగా ఉంటారు. బిగ్ బాస్ సీజన్-6 లో తన అందంతో ఆకట్టుకుంది వాసంతి కృష్ణన్. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న సెలబ్రిటీలు తమ ఫ్యాన్స్ కి మరింత చేరువగా ఉండేందుకు‌ సొంతంగా యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వాసంతి కృష్ణన్ ఆ జాబితాలోకి చేరింది. బిగ్ బాస్ లో గ్లామర్ కి కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన బ్యూటీ వాసంతి కృష్ణన్. బిగ్ బాస్ లో ఎంట్రీతో ఫేమ్ లోకి వచ్చిన ఈ గ్లామర్ క్వీన్, బిగ్ బాస్ తర్వాత వరుస ఆఫర్స్ తో బిజీగా ఉంది.

హౌజ్ లో ఉన్నన్ని రోజులు వెనకాల ఉండి ఎక్కువగా గ్రూప్ లతో కలవకుండా ఇండివిడ్యువల్ గా ఉన్న వాసంతి. మరో వారంలో బయటకొస్తుందనే టైమ్ లో ఒక్కొక్కరితే కలవడం ప్రారంభించింది. కానీ అప్పటికే తనకి ఫ్యాన్ బేస్ లేకపోవడం, టాస్క్ లలో, గేమ్స్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయకపోవడంతో తను నామినేషన్లో ఉన్నప్పుడు ఓటింగ్ లిస్ట్ లో వెనుకబడింది. దాంతో హౌజ్ నుండి బయటకొచ్చింది వాసంతి. అయితే బిగ్ బాస్ నుండి బయటకొచ్చాక సినిమా ఆఫర్లు చాలానే వచ్చాయి. ప్రస్తుతం బీబీ జోడీలో అర్జున్ కి జంటగా వాసంతి జత కట్టి అందరిని తన డాన్స్ తో తన వైపుకి తిప్పుకుంది. ప్రస్తుతం వాసంతి వరుస ఆఫర్స్ తో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. అంతే కాకుండ పలు టీవీ కార్యక్రమాల్లో కనిపిస్తు ప్రేక్షకులకు ఎప్పుడు దగ్గరగా ఉంటు వస్తుంది వాసంతి. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. తాజాగా శ్రీసత్యతో, వాసంతి చేసిన డాన్స్ ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే.

తాజాగా వాసంతి ఇన్ స్టాగ్రామ్ లో తనొక ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేస్తున్నట్టు ఆఫీషియల్ గా చెప్పేసింది. " ఇప్పటివరకు నా జీవితాన్ని స్క్రీన్ పైన వన్ సైడ్ చూశారు. ఇకనుండి మై కంప్లీట్ లైఫ్ స్టైల్ నా యూట్యూబ్ ఛానల్ ద్వారా చూపించబోతున్నాను. మీరందరి సపోర్ట్ నాకు కావాలి" అంటూ ఒక పోస్ట్ ని షేర్ చేసింది. కాగా ఇప్పుడు ఈ పోస్ట్ ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. అసలే గ్లామర్ తో ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. మరి ఇప్పుడు తన పర్సనల్ లైఫ్ ని యూట్యూబ్ ద్వారా పంచుకోవాలనుకున్న వాసంతి.. ఎలా ఎంటర్టైన్మెంట్ చేస్తుందో చూడాలి మరి!

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.