English | Telugu

యాంకర్ వర్షిణికి పెళ్ళి కాలేదని బాధపడుతోందట!

వధువు, వరుడు కావలెను లాంటి సినిమాల్లో హీరో, హీరోయిన్ పాత్రలకి ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అలాగే కొంతమంది బుల్లితెర నటీమణులకి క్రేజీ ఫాలోయింగ్ ఉంటుంది. అందులోను అనసూయ, రష్మీ, సిరి హనుమంత్, వర్షిణి, లాంటి యాంకర్ లకి మరీను. అయితే వర్షిణికి ఇప్పుడు ఒక సమస్య ఎదురైందంట.. అదే విషయాన్ని తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో తెలియజేసింది.

సినిమాల మీద మక్కువతో ఇండస్ట్రీకి వచ్చిన వర్షిణి బుల్లితెరకే పరితమైంది. అందంతో పాటు అటిట్యూడ్ ఉన్న ఈ భామ కొన్ని వెబ్ సిరీస్ లలో నటించి పేరు తెచ్చుకుంది. అయితే ఒకప్పుడు బుల్లితెరపై చాలా ప్రోగ్రామ్స్‌కి యాంకరింగ్ చేసేది. కానీ ఈ మధ్య ఎందుకోగానీ రెగ్యులర్‌గా ఏ షోలోనూ కనిపించడం లేదు. ప్రస్తుతం ఫెస్టివల్ ఈవెంట్స్ మాత్రమే చేస్తుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటుంది. అప్పట్లో ఢీ షోతో పాటు పలు టీవీ కార్యక్రమాల్లో కనిపించేది యాంకర్ వర్షిణి. కానీ ఇప్పుడు మాత్రం అంతగా కనిపించడం లేదు. పైగా ఏదైనా పెద్ద ఈవెంట్ వస్తేనే దర్శనమిస్తుంది.

గతేడాది జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకి సపోర్ట్ చేస్తూ ప్రతీ మ్యాచ్ కి హాజరైంది. అయితే తను వెళ్ళిన ప్రతీ మ్యాచ్ హైదరాబాద్ జట్టు ఓడిపోవడంతో తనని తిడుతూ చాలామంది నెటిజన్లు ట్రోల్స్, పోస్ట్ లు చేయడంతో వర్షిణి బయటకు రాలేకపోయింది. అయితే కొన్ని రోజుల క్రితం పట్టు లంగా వోణీ డ్రెస్ వేసుకొని ఉన్న కొన్ని ఫోటోలని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా అవి వైరల్ గా మారాయి. అయితే ఇప్పుడు మరో పోస్ట్ చేసి వార్తల్లో నిలిచింది. అదేంటంటే.. తన వయసువాళ్ళలో కొందరు పెళ్ళిళ్ళు చేసుకున్నారని, మరికొందరు ప్రెగ్నెంట్ అయ్యారని.‌ తను మాత్రం బయటకు వెళ్లటానికి ఇంకా వాళ్ళ అమ్మ పర్మిషన్ అడుగుతుందని ఓ వీడియోని తన ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసింది. పెళ్ళి కాలేదని భాదపడుతున్నావా అంటు కొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మై ఏజ్ ఈజ్ వైర్డ్.. అని వర్షిణి పోస్ట్ చేసిన ఈ పోస్ట్‌ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.