English | Telugu

సర్కార్‌లో సందడి చేసిన ‘ఉగ్రం’ టీమ్!

ఆహా ఓటిటి ప్లాట్ఫార్మ్ మీద ఎన్నో గేమ్ షోస్ వస్తూ ఉన్నాయి అలాగే సూపర్ హిట్ మూవీస్ తో పాటు ఆకట్టుకునే వెబ్ సిరీస్ లను అందిస్తోంది.. ఇందులో భాగంగానే పాపుల‌ర్ గేమ్ షో స‌ర్కార్ ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో స‌రికొత్త సీజ‌న్‌తో మే 5 నుంచి ఆడియ‌న్స్ కి ఎంటర్టైన్మెంట్ పంచడానికి సిద్ధ‌మ‌వుతోంది. ప్ర‌తి శుక్ర‌వారం ప్రసారం కాబోయే ఈ షోకి ప్ర‌దీప్ మాచిరాజు హోస్ట్ చేస్తున్నాడు. సర్కార్ సీజన్ 3 ప్రోమోని రీసెంట్ గా రిలీజ్ చేసింది ఆహా. "రెండు అద్భుతమైన సీజన్లు...100 కు పైగా సెలబ్రిటీస్.. ఎన్నో ఎమోషన్స్...ఎంతో ఎక్సయిట్మెంట్...సర్కార్ ఈజ్ బ్యాక్ విత్ సీజన్ 3 "అంటూ ప్రదీప్ తన స్టైల్లో ఇంట్రడక్షన్ ఇచ్చేసాడు. ఇక ఫస్ట్ ఎపిసోడ్ కి ఉగ్రం మూవీ టీమ్ వచ్చింది. అల్లరి నరేష్ తెగ అల్లరి చేసేసాడు. ప్రదీప్ కి సంకెళ్లు వేసి ఇంటరాగేషన్ చేసాడు. "నీ మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి. సర్కార్ లో క్లూస్ ఈజీగా ఇచ్చేసి క్వశ్చన్స్ టఫ్ గా అడుగుతున్నావట" అని అడిగేసరికి "అది ఫార్మేట్ సర్" అన్నాడు ప్రదీప్.."డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి తీసేసుకున్నావట" అని అడిగేసరికి "అది రూల్ సర్" అన్నాడు.

అవన్నీ సెట్ చేయడానికే ఫస్ట్ ఎపిసోడ్ కి నేనొచ్చాను" అన్నాడు. మలయాళంలో ఏదైనా టంగ్ ట్విస్టర్ చెప్పమని ఉగ్రం మూవీ హీరోయిన్ మిర్న మీనన్ ని ప్రదీప్ అడిగాడు. ఆమె చెప్పింది కానీ ప్రదీప్ చెప్పడంలో ఫెయిల్ అయ్యాడు. "మొట్ట మొదటి ప్రశ్న" అని ప్రదీప్ అనేసరికి "ప్రదీప్ జాగ్రత్తగా ఆలోచించు" అంటూ లాఠీ చూపించేసరికి భయపడినట్టు నటించాడు. తర్వాత మిర్న "దాని కుడి భుజం మీద" సాంగ్ కి డాన్స్ చేసి ఎంటర్టైన్ చేసింది. ఇక ప్రదీప్ అడిగిన ప్రశ్నలకు ఈ టీమ్ మొత్తం బెట్ కట్టింది. ఐతే ఇందులో ప్రదీప్ ఏం ప్రశ్నలు అడిగాడు. ఎవరు ఎంత మనీ బెట్ కట్టారు. సర్కారు వారి పాట సీజన్ 3 ఫస్ట్ ఎపిసోడ్ ఎలా ఉండబోతోందో తెలియాలి అంటే మే 5 వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.