English | Telugu

రోజుకో ట్విస్ట్ తో దూసుకెళ్తున్న ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్!

తెలుగు సీరియల్స్ లలో ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ కి రోజు రోజుకి ఫ్యాన్ బేస్ పెరిగిపోతుంది. దానికి కారణం మంచి కథ. ఏ సీరియల్ అయిన కథ బాగుంటేనే సరైన హిట్ లభిస్తుంది. ఈ సీరియల్ లో సీతాకాంత్, రామలక్ష్మిల జంటకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.

నిన్న మొన్నటిదాకా సిరి, ధనల ఇష్యూ సాగగా.. నేటి ప్రోమోలో అభి ఏకంగా ఇంటికే వస్తాడు. దాంతో కథ మరింత ఆసక్తికరంగా మారింది. మాణిక్యం వన్ మ్యాన్ షోగా సీతాకాంత్ ఎత్తులు ఓవైపు.. శ్రీలత తెగింపు మరోవైపు సాగుతుంది. గత జన్మలో ప్రేమించుకొని విడిపోయిన రామలక్ష్మి, సీతాకాంత్.. ఈ జన్నలోనైనా కలుస్తారా లేదా అనే కథాంశంతో మొదలైన ఈ కథ.. మొదటి ఎపిసోడ్ నుండి ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. అందులోను ఇద్దరి భిన్నమైన ఆలోచనలు, అభిప్రాయాలు.. అయితే రామలక్ష్మికి ముందుగానే అభి అనే బాయ్ ఫ్రెండ్ ఉండటంతో కథలో మెలిక మొదలైంది. అభి వాళ్ళింటికి సీతాకాంత్ వెళ్ళి అక్కడ అన్నీ విషయాలు తెలుసుకుంటాడు.

మరోవైపు శ్రీలత, సందీప్ ఇద్దరు అభిని కలుస్తారు. రామలక్ష్మి ఏమవుతుందని వాళ్ళు అడుగగా.. మేమ్ ఫ్రెండ్స్ అని అభి చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక వాళ్ళింటికి అభి వెళ్ళగా.‌. సీతాకాంత్ వచ్చాడని అన్నీ తెలుసుకున్నాడని అభి వాళ్ళ అమ్మ చెప్తుంది. ఇక నేటి ప్రోమోలో శ్రీలత, సందీప్, రామలక్ష్మి, సిరి, ధన అందరు కలిసి భోజనం చేస్తుంటారు. ఏంటి మమ్మీ గత రెండు రోజులుగా క్లబ్ కి వెళ్ళట్లేదని శ్రీలతని సందీప్ అడుగగా.. మా ఫ్రెండ్ రాజ్యలక్ష్మి అని ఒకరున్నారు. తన కోడలు పెళ్లికి ముందే ఒకరిని ప్రేమించి , పెళ్ళి తర్వాత వాడితో లేచిపోయింది. దాంతో వాళ్ళ ఫ్యామిలీ బయటకు రాలేకపోతున్నారని శ్రీలత చెప్తుంది. అది విని రామలక్ష్మి హర్ట్ అవుతుంది. తినకుండా చేయి కడిగేసి వెళ్ళిపోతుంది. అయితే అభి గురించి తెలిసిన నిజాల్ని రామలక్ష్మికి సీతాకాంత్ చెప్పగలడా? అభి ఎవరో శ్రీలత, సందీప్ కనిపెట్టగలరా లాంటి ట్విస్ట్ లతో ఈ సీరియల్ ఆసక్తికరంగా సాగుతుంది. మరి మీలో ఎంతమంది ఈ సీరియల్ కి అభిమానులో కామెంట్ చేయండి.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.