Read more!

English | Telugu

రాజ్ మాటలతో విసుగుచెందిన స్వప్న.. రాహుల్ ఫ్లర్టింగ్ సక్సెస్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ ఎపిసోడ్ -18 లోకి అడుగుపెట్టింది. కాగా సోమవారం నాటి ఎపిసోడ్ లో.. దుగ్గిరాల ఫ్యామిలీని ఇంప్రెస్ చేయడానికి కనకం ప్రయత్నిస్తుంది. అయితే కనకం మాట్లాడేప్పుడు ఎక్కడో ఒక దగ్గర నోరు జారుతుంది. ఆ ఇంట్లో వాళ్ళకి డౌట్ వస్తే మళ్ళీ తనే మేనేజ్ చేస్తుంది. "మీరు మా ఇంటికి వచ్చి మా ఇంటి గురించి తెలుసుకున్నారు.. మేము మీ ఇంటికి వచ్చి మీ స్థితిగతులు తెలుసుకోవాలి కదా.. మీ ఇంటికి వస్తాం" అని రాజ్ అమ్మ అంటుంది. కనకం ఒక్కసారిగా షాక్ అయ్యి.. ఇక చేసేదిమీ లేక సరేనని చెప్తుంది.

మరోవైపు రాజ్ తో డేటింగ్ లో ఉండి.. అతను చెప్పేవి వింటూ స్వప్న బోరింగ్ గా ఫీల్ అవుతుంటుంది. రాజ్ మాట్లాడుతున్నంత సేపు మనసులో తిట్టుకుంటుంది. కాసేపటికి ఇక వెళదామా అని రాజ్ అనగానే.. హమ్మయ్య సోది భరించలేకపోతున్నా  అని స్వప్న మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత ఇద్దరు రాజ్ కార్ లో బయల్దేరతారు. రాజ్ కార్ లో మ్యూజిక్ ప్లే చేస్తాడు. అందులో అన్నీ ఓల్డ్ సాంగ్స్ పెట్టడంతో.. "జీవితాంతం ఈ పాత పాటలు వినుకుంటూ ఉండాలా దేవుడా?" అని స్వప్న అనుకొని .. కాసేపటికే భరించలేకపోతుంది. ఇక్కడ నాకు పని ఉందని చెప్పి స్వప్న కార్ లో నుండి దిగిపోతుంది. మరోవైపు స్వప్నని వెతుక్కుంటూ కాఫీ షాప్ కి వస్తుంది కావ్య. అక్కడ లేకపోయేసరికి తిరిగి వెళ్తుండగా... రాజ్ కార్ సడన్ బ్రేక్ వెయ్యాగా బయపడి కావ్య కింద పడిపోతుంది. వెంటనే రాజ్ కార్ దిగి ఎవరని చూస్తాడు. కావ్యని గుర్తుపట్టి.. "నీకేం పని లేదా.. ఎప్పుడు నాకు ఎదురు పడుతావ్" అంటూ ఆవేశపడతాడు. నీతో గొడవ పడటానికి నాకేం పనిలేదా అని కావ్య అంటుంది. ఇలా ఇద్దరి మధ్యలో మరింత గొడవ అవుతుంది.


మరోవైపు స్వప్న కార్ దిగి నడుచుకుంటూ వెళ్తూ ఆలోచనలో పడుతుంది. రాహుల్ నన్ను ఇంప్రెస్ చెయ్యడానికి ట్రై చేస్తున్నాడు. తనతో ఉన్నంత సేపు తన మాటల్లో నామీద కేరింగ్ కన్పించింది. అది బాగుంది.. కానీ రాజ్ మాట్లాడుతున్నంతసేపు బోరింగ్ గా అనిపించింది. ఒక గంటసేపు ఉంటేనే ఇలా ఉంది. ఇక జీవితం మొత్తం ఉంటే నా పరిస్థితి ఏంటో అని ఆలోచిస్తూ.. నా అందం మొత్తం ఆడవి కాచిన వెన్నెల అయిపోతుందేమోనని స్వప్న అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.