English | Telugu

తన పెళ్ళి సంప్రదాయబద్ధంగా జరగాలని చెప్పిన రాజ్!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'.. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్‌-28 లో.. కనకం ఖరీదైన చీరలు తీసుకురావడంతో కావ్య చూసి.. ఇంత ఖరీదైన చీరలు కొనడానికి మీకు డబ్బులు ఎక్కడివని కనకంని అడుగుతుంది కావ్య.. "నీకెందుకు అవన్నీ" అని కనకం అనగానే.. ఎందుకంటే ఆ అప్పులు తీర్చాలిసింది నేనే కాబట్టి అని కావ్య అంటుంది. "ముగ్గురు కూతుళ్ళ పెళ్ళిళ్ళు ఎలా చేస్తావే కనకం.. నేను సాయం చేస్తానని చెప్పి మా అక్క డబ్బులు ఇచ్చింది" అని చెప్పి కవర్ చేస్తుంది కనకం. అలా చెప్పినా కూడా కావ్యకి కనకం మీద అనుమానం కలుగుతుంది.

మరోవైపు పెళ్ళి దగ్గరపడడంతో రాజ్ ఫ్యామీలీ అంతా టెన్షన్ పడుతుంటారు. రాజ్ వాళ్ళ అమ్మనాన్న వచ్చి పెళ్ళికి ఎక్కువ టైం లేదు కాబట్టి పెద్ద ఈవెంట్ కంపెనీతో మాట్లాడదాం.. వాళ్ళే అన్నీ చూసుకుంటారని అనుకుంటారు. ఇక అప్పుడే వచ్చిన రాజ్ వాళ్ళ తాతయ్య సీతారామయ్య.. "రాజ్ పెళ్ళి నీ జీవితంలో ఒకేసారి జరుగుతుంది. దీన్ని నువ్వెలా జరగాలని కోరుకుంటున్నావ్" అని అడుగుతాడు. పెళ్ళి మొత్తం సంప్రదాయబద్ధంగా జరగాలని అనుకుంటున్నాను తాతయ్య అని రాజ్ అనగానే.. సీతారామయ్య సంతోషపడి..అలాగే జరిపిద్దామని చెప్తాడు.
ఇక పెళ్ళికి కావలిసిన బొమ్మలు సామాన్లు కావ్య దగ్గరే తీసుకోవాలని కళ్యాణ్ అనుకొని కావ్య దగ్గరికి వస్తాడు.. కళ్యాణ్ వచ్చి బొమ్మల డెకరేషన్ కాంట్రాక్టు కావ్యకి ఇస్తాడు. దానికి కావ్య ఒప్పుకొదు. ఇక పక్కనే ఉన్న అప్పు కావ్యని పక్కకి తీసుకెళ్ళి... "ఇప్పుడు మన అమ్మ చాలా అప్పులు చేస్తుంది.. వచ్చిన కాంట్రాక్ట్ వద్దు అనకక్కా" అని చెప్పడంతో కావ్య కాంట్రాక్టు ఒప్పుకుంటుంది.

మరోవైపు రాహుల్ ని ప్రేమిస్తున్న విషయాన్ని ఎలాగైనా కనకంకి చెప్పాలని స్వప్న ప్రయతిస్తుంది. కనకం మాత్రం చెప్పే అవకాశం ఇవ్వదు..స్వప్న చెబుదామని అనుకుంటుండగా.. మీనాక్షి తన నగలు తీసుకొని వచ్చి పెళ్ళి వరకు ఉంచుకొని.. పెళ్ళి తర్వాత నావి నాకు ఇచ్చేయ్ అని కనకంతో అంటుంది. ఇక వీళ్ళు నగల గురించి మాట్లాడుకుంటుంటే స్వప్నకి కోపం వస్తుంది. రాజ్ అప్పుడే స్వప్న కి కాల్ చేస్తాడు. చిరాకుగా ఉన్న స్వప్న.. బిజీగా ఉన్నానని అనడంతో సరే అని రాజ్ ఫోన్ కట్ చేస్తాడు. మరోవైపు స్వప్న, రాహుల్ కి ఫోన్ చేస్తుంది. రాహుల్ వేరే అమ్మాయికి పులిహోర కలుపుతుంటాడు. స్వప్న ఫోన్ చేసింది చూసిన కూడా లిఫ్ట్ చేయడు. ఇలా లిఫ్ట్ చేయకుండా ఉంటేనే నా ఆలోచనలో పిచ్చెక్కిపోతావు.. అప్పుడు నేను ఏం చెప్తే అది చేస్తావ్ అని అనుకుంటాడు. కానీ స్వప్న మాత్రం రాహుల్ బిజీ పర్సన్ కదా ఎలాగూ నాతోనే ఉంటాడు కదా అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.