English | Telugu

ట్రెండింగ్ లో సుమ కొత్త వ్లాగ్!

సుమ కనకాల ఏం చేసిన ట్రెండ్ అవుతుంటుంది. రీసెంట్ గా ’ది నెస్ట్' అనే అనాధాశ్రమం నిర్మించి ఏంతో మంది పేదలని,అనాధలనిఅక్కున చేర్చుకుంది సుమ కనకాల. మానవ సేవే మాధవ సేవ అంటూ మంచి కార్యక్రమాలు చేస్తున్న సుమ.. ఈవెంట్స్, వ్లాగ్స్ తో బిజీ జీవితం గడుపుతుంది. ఆయితే తను తాజాగా గుంటూరు వెళ్ళిందంట. అక్కడ బాగా ఫేమస్ అయిన బిర్యానీ తిందని, అక్కడ జనాలంత సుమ తినేదాకా వెయిట్ చేశారని, తను తిన్నాక అందరు ఫోటోలు దిగారని చెప్పింది సుమ‌. అయితే ఇదంతా తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసింది సుమ.

బుల్లితెర స్టార్ మహిళ సుమ కనకాల‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన మాటలతో స్టార్ హీరోలని, డైరెక్టర్ లను సైతం మెప్పిస్తూ యాంకరింగ్ లో కొత్త ఒరవడిని సృష్టించింది. ఎంతమందిలో ఉన్నా.. ఏ స్టేజ్ మీద అయినా తన మాటలతో మెస్మరైజ్ చేస్తూ అనర్గళంగా మాట్లాడుతుంది సుమ. స్పాంటేనియస్‌ కామెడీ పంచ్ లతో ఎప్పుడు ఆకట్టుకునే సుమ.. సోషల్ మీడియాలో కూడా తన ప్రతిభని కనబరుస్తుంది. తన యూట్యూబ్ ఛానెల్ లోను వీడియోలు చేస్తూ బిజీగా ఉంటుంది సుమ. తన యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసి అందులో కొన్ని టిప్స్ ఇస్తూ వీడియోలు కూడా చేస్తుంది. రీసెంట్ గా మహిళల కోసం ఒక వీడియోని చేసి మహిళలకి విలువైన టిప్స్ ని ఇచ్చింది సుమ. తనకు తోచినదే కాకుండా మహిళలకి ఎలా ఉండాలో కొన్ని కొత్త ఐడియాలని ఇస్తూ ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తోంది.

అటు షూటింగ్స్ అంటూ బిజీగా ఉంటూనే, ఇటు ప్రమోషనల్ వీడియోలు చేస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది సుమ. తన యూట్యూబ్ ఛానెల్ ని విజయ్ దేవరకొండ లాంచ్ చేశాడు. ఆ తర్వాత అనేక రకాల వ్లాగ్స్ చేసి అప్లోడ్ చేసింది సుమ. అందులో రాజీవ్ కనకాలతో చేసిన.. ' మా ఆయనకి నచ్చిన పులిహోర' అనే వ్లాగ్ అత్యధిక వీక్షకాధరణ పొందింది. చిన్నపిల్లలతో అల్లరి చిల్లరగా బిహేవ్ చేస్తూ ' స్ట్రెస్ బస్టర్స్ ' అంటూ కొత్త కొత్త ఎపిసోడ్‌లతో ఫుల్ ట్రెండింగ్ లో ఉంటుంది సుమ. తాజాగా తన గుంటూరులోని సుభానీ హోటల్ కి వెళ్ళింది. అక్కడ బిర్యాని తిని, అది బాగుందని చెప్పింది సుమ. ఎక్కడికి వెళ్ళిన రివ్యూ ఇచ్చే సుమ బిర్యానీ గురించి చెప్పుకొచ్చింది సుమ. సడెన్ విజిట్ టూ బిర్యానీ హోటల్ అనే వ్లాగ్ ని తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసింది‌. ఇప్పుడు ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తుంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.