Read more!

English | Telugu

టాప్ 5 షోస్ క్లబ్ లో ఉన్న స్టార్ మా సీరియల్స్ ఇవే...

కార్తీకదీపం ప్రసారమైనన్ని రోజులూ రేటింగ్స్ లో ముందు వరసలో నిలబడింది. ఈ సీరియల్ కి "ఇంటింటి గృహలక్ష్మి" సీరియల్ గట్టి పోటీ ఇచ్చేది. కానీ కార్తీక దీపం ఐపోయాక గృహలక్ష్మి సీరియల్ కూడా టీఆర్పీ రేటింగ్స్ లో డౌన్ ఐపోయింది. "గుప్పెడంత మనసు" సీరియల్ మాత్రం ప్రతీ వారం టాప్ రేటింగ్‌తో నెంబర్ వన్ ప్లేస్ లో కొనసాగుతోంది. 

ఈ సీరియల్ పాత్రధారులైన రిషి, వసుధార చేస్తున్న మాయతో ఈ సీరియల్ నిలకడగా ముందు వరసలో ప్రతీ వారం నిలబడుతుంది.  ఇప్పుడు ఇంకో కొత్త విషయం ఏమిటి అంటే కార్తీక దీపం స్లాట్ లో వస్తున్న కొత్త సీరియల్ ‘బ్రహ్మముడి’ సెకండ్ ప్లేస్ లో నిలబడింది.. ఇంటింటి గృహలక్ష్మి మూడవ స్థానాన్ని సొంతం చేసుకుంది. గత వారాల రేటింగ్ తో పోల్చుకుంటే ఈ వారం ఈ సీరియల్ ని వీక్షించిన వారి సంఖ్య చాలా తక్కువగానే ఉందని టీఆర్పీ రిపోర్ట్ చెప్తోంది. దేవత సీరియల్ టైం స్లాట్ లో ప్రసారమవుతున్న "కృష్ణ ముకుంద మురారి"  నాలుగో స్థానంలో నిలిచింది. గత వారం లాగే ఈ వారం కూడా "త్రినయని"  టాప్ 5 షో లిస్ట్ లో తన స్థానాన్ని నిలబెట్టుకుంది. 

ఇక మిగతా షోస్ విషయానికి వస్తే బీబీ జోడి, సుమ అడ్డా షోల రేటింగ్ కూడా చాలా తగ్గింది. ఇక  జబర్దస్త్ మరియు ఎక్స్‌ట్రా జబర్దస్త్ రేటింగ్స్ మాత్రం ఎలాంటి తేడా లేదు. వచ్చే వారం ఏ సీరియల్ ఏ లిస్ట్ లో ఉంటుందో గృహలక్ష్మి ఎమన్నా ముందు వరుసలోకి వస్తుందా లేదంటే ఇదే రేటింగ్ కొనసాగిస్తుందా వేచి చూడాలి.