English | Telugu

అమ్మమ్మను చివరి చూపు కూడా చూసుకోలేకపోయా...


ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ఈ వారం అమ్మమ్మగారింట్లో అంటూ టెలికాస్ట్ అయ్యింది. అసలే పిల్లలందరికీ సమ్మర్ హాలిడేస్ కాబట్టి అమ్మమ్మగారింటికో నానమ్మ వాళ్ళ ఇంటికో వెళ్ళిపోయి సమ్మర్ హాలిడేస్ ని అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ వారం బుల్లితెర నటీనటుల్ని ఈ షోకి వచ్చారు. ఇక సీనియర్ నటి అన్నపూర్ణ కూడా వచ్చింది. గేమ్స్, టాస్కులు ఆడిన తర్వాత అందరూ రౌండ్ గా కూర్చుంటే అన్నపూర్ణమ్మ పెద్ద బేసిన్ లో ఆవకాయ అన్నం కలిపి అందరికీ ముద్దలు కలిపి పెట్టింది. ఈ నోస్టాల్జియా మెమోరీస్ అమ్మమ్మతో ఎక్కువగా ఉంటాయి. దాంతో షోలో వాళ్ళ వాళ్ళ చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళింట్లో ఎలా గడిచాయో చెప్పారు.

ఐతే అన్నపూర్ణ శ్రీముఖి వాళ్ళ అమ్మమ్మతో దిగిన ఫోటో చూపించి దాని వెనక స్టోరీ అడిగింది. "ఆవిడే మా అమ్మమ్మ..ఆవిడొక స్ట్రాంగ్ లేడీ. ఆమె పేరు కవిత. ఈరోజు నేను ఈ స్టేజి మీద ఉన్నాను అంటే, ఇంత ఎనెర్జీగా ఉన్నానంటే, ఇంత యాక్టివ్ గా ఉన్నాను అంటే దానికి కారణం మా అమ్మమ్మ. ఇండస్ట్రీకి రావడానికి కారణం ఆమె. ఇండస్ట్రీకి రావడం హ్యాపీగా ఫీలవ్వాల, స్యాడ్ గా ఫీలవ్వాల అనే ఒక సందర్భం వచ్చింది. నేను ఒక షాప్ ఓపెనింగ్ కి వేరే ఊరు వెళ్లాం. ఎర్లీ మార్నింగ్ షాప్ ఓపెనింగ్ ఉంది. దానికి ముందు రోజు నైట్ మా అమ్మమ్మ చనిపోయిందంటూ న్యూస్ వచ్చింది. ఐతే ఆ షాప్ వాళ్ళను పర్మిషన్ అడిగాను. వాళ్ళు కుదరదు అన్నారు. ఇంత వరకు వచ్చింది. షాప్ ఓపెనింగ్ చేసి వెళ్లిపోండి అన్నారు. సరే అప్పుడు ఇంట్లో వాళ్లకు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశా...నేను వచ్చేవరకు అమ్మమ్మను తీసుకెళ్లొద్దు చివరి చూపు చూసుకోవాలి అని చెప్పాను. కానీ కుదర్లేదు. కానీ లాస్ట్ లో స్నానం అదంతా చేయిస్తారు కదా ఆ తంతు మొత్తాన్ని వీడియో కాల్ లో చూపించారు. నేను ఆ షాప్ ఓపెనింగ్ చేసి కాకినాడ నుంచి అమ్మమ్మ ఊరు వెళ్లేసరికి అర్ధరాత్రి అయ్యింది. నేను వెళ్లేసరికి అక్కడ అమ్మమ్మ లేదు. నా లైఫ్ లో ఉన్న ఒకే ఒక రిగ్రెట్ ఆమెను ఒకే ఒక్కసారి చూసి ఉంటే బాగుండేమో అనిపించింది.. నేను ఈ రోజు ఇంత స్ట్రాంగ్ గా ఉండడానికి రీజన్ ఆమెనే. ఆమె లేని లోటు ఎవరూ తీర్చలేరు. నేను స్టేజి మీద ఎప్పుడూ తినలేదు. అన్నపూర్ణమ్మ చేతులు మా అమ్మమ్మలా ఉంటాయి..అందుకే ఆమె చేతులతో ఈ గోరుముద్ద తింటున్నా" అంటూ ఏడ్చేసింది శ్రీముఖి.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.