English | Telugu

కన్నీళ్లు పెట్టుకున్న లేడీ ఆటో డ్రైవర్స్...ఆటో డ్రైవర్ కాన్సెప్ట్ తో శ్రీదేవి డ్రామా కంపెనీ

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో ఫుల్ ఎమోషనల్ గా ఉంది. ఈ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ అంతా కూడా ఆటో డ్రైవర్ థీమ్ తో రాబోతోంది. ఐతే ఈ ఎపిసోడ్ కి యాంకర్ రవి వచ్చాడు. ఐతే రవిని చూసిన నూకరాజు "ఏ మీటర్ లేకుండా నువ్వు రావు కదా" అనేసరికి "ఆటో డ్రైవర్ లు పడే కష్టాలను ఆడియన్స్ కి చూపించడం కోసం నేను వచ్చాను" అని చెప్పాడు రవి. అంటే ఎపిసోడ్ మొత్తం కూడా ఆటో డ్రైవర్ ల కష్టాలు, డాన్స్, పెర్ఫార్మెన్స్, స్కిట్స్ , సింగింగ్, ఎమోషన్స్ అన్నీ కూడా ఇదే థీమ్ మీద జరిగింది. ఐతే తాగుబోతు రమేష్, పంచ్ ప్రసాద్ వచ్చి ఆటో మీద జోక్స్ వేశారు. "నా ఆటో మీద మంచి కొటేషన్స్ రాసినా ఎవరూ ఎక్కడం లేదు" అని తాగుబోతు రమేష్ అనడంతో..ఇంతకు ఎం రాసావు అని ప్రసాద్ అడిగాడు. "లోకంలో లేవు కాకులు...నా ఆటోకు లేవు బ్రేకులు" అని రాసినట్లు చెప్పాడు. బ్రేకులు లేని ఆటోలో ఎలా ఎక్కుతారు అంటూ ప్రసాద్ కౌంటర్ వేసాడు. ఇక ఈ షోకి రియల్ లైఫ్ లోని కొంతమంది లేడీ ఆటో డ్రైవర్స్ వచ్చారు.

"మా ఆయన చనిపోయి 18 ఏళ్ళు అయ్యింది. నేను అప్పటి నుంచి ఆటో నడుపుకుంటూ ఇద్దరు పిల్లలను చూసుకుంటున్నా" అంటూ ఒకావిడా చెప్పారు. " నేను 2014 నుంచి ఆటో వేయడం స్టార్ట్ చేసాను..నువ్వు ఛస్తే చావు కానీ మా డబ్బులు ఇవ్వండి " అంటారంటూ ఇంకొకావిడ చెప్పుకొచ్చారు. ఇంకో కుర్రాడైతే "మార్నింగ్ డిగ్రీ చదువుకుంటూ సాయంత్రం ఆటో నడుపుకుంటున్నా" అని చెప్పాడు. తర్వాత ఆదర్శ్ వచ్చి ఆటో డ్రైవర్ గా డాన్స్ చేసాడు. అలాగే ఇంకో ఇద్దరు లేడీ డాన్సర్స్ వచ్చి ఆటో డ్రైవర్ గెటప్స్ లో డాన్స్ చేసి ఎంటర్టైన్ చేశారు.ఇక ఈ ప్రోమోలో ధరణి ప్రియా విమెన్ సెల్ఫ్ డిఫెన్సె యాక్ట్ చేసి చూపించింది. అలాగే తన చంకలో ఒక బిడ్డతో వచ్చి కత్తి తీసుకుని దుండగుల మీద ఎలా అటాక్ చేయాలి అనేది చేసి చూపించింది. ఫైనల్ గా కొరియోగ్రాఫర్ సుదర్శన్ మాష్టర్ వచ్చి రియల్ లైఫ్ ఆటో డ్రైవర్ ఎమోషన్స్ ఎలా ఉంటాయో చేసి చూపించాడు. ఒక ఆటో డ్రైవర్ కి లైఫ్ లో కష్టాలు ఎలా ఉంటాయి అనేది చేసాడు. అంటే అప్పులు, వడ్డీలు, స్కూల్ ఫీజులు, ఇంటి రెంట్, ఇంట్లో తినడానికి ఇవన్నీ కూడా చేసి చూపించాడు. "నేను ఈరోజు గర్వంగా చెప్పుకుంటాను...నేనొక ఆటో డ్రైవర్ కొడుకుని అని" అంటూ చెప్పుకొచ్చాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.