English | Telugu
రష్మిని హైపర్ ఆది తెలిసే కొట్టాడా?
Updated : Jul 8, 2022
జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్‌ని సుడిగాలి సుధీర్‌తో పాటు అనసూయ కూడా వదిలేయడంతో హైపర్ ఆది కూడా జబర్దస్త్‌ని వీడి `శ్రీదేవి డ్రామా కంపెనీ`లో సెటిలయ్యాడు. సుడిగాలి సుధీర్‌తో పాటు అనసూయ స్టార్ మాలో సెటిలైపోయారు. అక్కడే సూపర్ సింగర్ షోతో పాటు పలు షోలకు యాంకర్స్ గా వ్యవహరిస్తున్నారు. `శ్రీదేవి డ్రామా కంపెనీ`లో సెటిలైన హైపర్ ఆది అక్కడ తనదైన స్టైల్లో పంచ్‌లు వేస్తూ నానా రచ్చ చేస్తున్నాడు. ఇందులోకి రీసెంట్ గా రష్మీ గౌతమ్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో ఇద్దరు కలిసి ఓ రేంజ్‌లో రచ్చ చేస్తున్నారు.
ఇంద్రజ ప్లేస్‌లో పూర్ణ కంటిన్యూ అవుతోంది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలు కాస్త క్రేజ్ తగ్గడంతో వాటి సందడి కనిపించడం లేదు. కానీ `శ్రీదేవి డ్రామా కంపెనీ` మాత్రం రీసౌండ్ ఇస్తోంది. సుధీర్‌తో మొదలైన ఈ షో ఇప్పడు పాపులర్ అయిపోయింది. ఇందులో లేడీ టీమ్ లీడర్స్ తో పాటు ఆటో రాం ప్రసాద్, హైపర్ ఆది, బుల్లెట్ భాస్కర్, ఇమ్మానుయేల్ వంటి వాళ్లు తమదైన స్కిట్లతో అదరగొడుతున్నారు. ఈ ఆదివారం జూలై 10 న ప్రసారం కానున్న తాజా ఎపిసోడ్ ని `ఆషాడం అల్లుళ్లు` పేరుతో ప్రత్యేకంగా ప్లాన్ చేశారు.
దీనికి సంబంధించిన ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు. ఈ షోకు నటి ప్రగతి గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా రష్మీని వర్ష కాసేపు ఆటపట్టించింది. "నువ్వు కూడా ఆషాడానికి వచ్చావు కదా అక్కా.. బావ అక్కడున్నాడు కదా" అని వర్ష కామెంట్ చేసింది. దీంతో రష్మీ.. "ఎవరే నీకు అక్క.. వెళ్లి కూర్చో" అని మండిపడింది. ఇక ఆదికి కళ్లకు గంతలు కట్టి అత్తలని కొట్టాలని కర్ర ఇవ్వడంతో దొరికిందే ఛాన్స్ అనుకుని రష్మీని కొట్టేశాడు.. ఆ తరువాత "నేను రష్మీని" అనడంతో ఐతే ఓకే అన్నాడు. దీంతో అక్కడున్న వారంతా నవ్వేశారు. నవ్వులు పూయిస్తున్న ఈ ఎపిసోడ్ జూలై 10 ఆదివారం ప్రసారం కానుంది.