English | Telugu

శ్రీ‌దేవి, శేఖ‌ర్ మాస్ట‌ర్ రొమాన్స్‌కు ప‌గ్గాలు లేవుగా!

పెళ్లి చేసుకున్నాక సినిమాల్లో క‌నిపించ‌కుండా పోయిన శ్రీ‌దేవి తాజాగా స్టార్ మా చాన‌ల్‌లో ఓంకార్ ప్రొడ్యూస్ చేస్తున్న 'కామెడీ స్టార్స్' షోలో వ‌న్ ఆఫ్ ది జ‌డ్జ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. మ‌రో జ‌డ్జిగా డ్యాన్స్ మాస్ట‌ర్‌ శేఖ‌ర్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. గ‌త కొన్ని వారాలుగా ఈ షో విజ‌యవంతంగా టెలికాస్ట్ అవుతోంది. అవినాష్. అరియానా, అషురెడ్డి ఓ టీమ్‌గా, చ‌మ్మ‌క్ చంద్ర అండ్ కో ఓ టీమ్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ త‌మ‌దైన కామెడీతో అల‌రిస్తున్నారు.

ఇదిలా వుంటే ఈ ఆదివారం 'కామెడీ స్టార్స్‌'లో రొమాన్స్ డోస్ పెంచేసిన‌ట్టున్నారు. 'ఉప్పెన‌' కాన్సెప్ట్‌తో కామెడీని పండించే క్ర‌మంలో కంటెస్టెంట్స్ 'ఉప్పెన'` పాట‌కు రొమాన్స్ చేస్తూ త‌మ‌ని తాము మ‌ర్చిపోయి చిందులేస్తూ ర‌చ్చ చేస్తున్నారు. యాంక‌ర్ ర‌వి, లాస్య ఓ రేంజ్‌లో రొమాన్స్ చేయ‌గా త‌మ ఛాన్స్ రావ‌డంతో శేఖ‌ర్ మాస్ట‌ర్‌, శ్రీ‌దేవి రెచ్చిపోయారు.

'ఉప్పెన‌'లోని "జ‌ల జ‌ల జ‌ల‌పాతం నువ్వు.." సాంగ్‌కు శేఖ‌ర్ మాస్ట‌ర్‌, హీరోయిన్ శ్రీ‌దేవి రెచ్చిపోయి స్టెప్పులేశారు. శేఖ‌ర్ మాస్ట‌ర్ ఛాన్స్ దొరికింది కదా అని శ్రీ‌దేవిని కౌగిలిలో బంధిస్తూ, ఫుల్ రొమాంటిక్ మూడ్‌లో త‌న‌ని తాను మైమ‌ర‌చిపోయాడు. శ్రీ‌దేవి కూడా సంద‌ర్భోచితంగా ఆ కౌగిలిని ఆస్వాదిస్తున్న‌ట్లు ఫీలింగ్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.