English | Telugu

ఒక్కసారి చేస్తే వదిలిపెట్టను...అందుకే సర్జరీ చేయించుకున్నాను!



శ్రీ సత్య గురించి చెప్పాలంటే బిగ్ బాస్ బ్యూటీగా చెప్పుకోవచ్చు.. ఆమె కొన్ని మూవీస్ చేసింది. అలాగే బిగ్ బాస్ నుంచి వచ్చాక కొన్ని డాన్స్ షోస్ చేసింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసి శ్రీ సత్య ఫేస్ గురించే టాపిక్ నడుస్తోంది. ఫేస్ లో ఏదో తేడా కొడుతోంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు. ఐతే ఇప్పుడు శ్రీసత్య ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. "ఎక్కడికి ఛాన్స్ కోసం వెళ్లాలన్నా చిన్నపిల్లగా ఉన్నావ్ అంటున్నారు. దానికి నా లిప్ కూడా ఒక సమస్యగా ఉంది. అందుకే లిప్ ఫిల్లింగ్ చేయించా. ఐతే ఇదేమీ పెర్మనెంట్ ఇదే కాదు ఒక మూడు నెలలు వరకే ఉంటుంది.

ముంబై, చెన్నై వాళ్ళను ఇండస్ట్రీలోకి తీసుకోవడానికి కారణం వాళ్ళ ఫేస్ డాల్స్ లా ఉంటుంది. నా లిప్స్ నాకు మైనస్ ఎందుకంటే పై పెదం చిన్నగా ఉంటుంది. ఐతే సినిమా వాళ్ళు చూసి ఇప్పుడు బాగుంది అంటున్నారు. ఐతే ఈ లిప్ ఫిల్లింగ్ అనేది తొందరలోనే పోతుంది. అప్పటి వరకు తప్పదు భరించండి అని చెప్పింది. అలాగే పెళ్లి టాపిక్ వచ్చేసరికి అసలు పెళ్లే చేసుకోను...ఫీలింగ్స్ చచ్చిపోయాయి. కే-డ్రామాస్ ఫాంటసీ అంటే ఇష్టం.. వాళ్ళ ప్రేమించుకునే విధానం నచ్చుద్ది. నాకు ఆటిట్యూడ్ అంటారు కానీ అలా ఉండను. కానీ కొంచెం భయం ఉంటుంది ఫ్రెండ్షిప్ అంటే నటించడం రాదు నాకు ..ఒక్కసారి ఫ్రెండ్షిప్ చేస్తే వదిలిపెట్టను" అని చెప్పింది శ్రీసత్య.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.