English | Telugu
బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసిన దేవి శ్రీ ప్రసాద్!
Updated : Oct 10, 2022
బిగ్ బాస్ హౌస్ లో ఆదివారం సరదగా గడిచింది. సండే ఫండే అంటు నాగార్జున వచ్చేసాడు. అయితే ప్రతి ఆదివారం హౌస్ లోకి ఎవరో ఒకరు గెస్ట్ గా రావడం జరుగుతుంది. కాగా ఈ సారి మ్యూజిక్ డైరెక్టర్ 'దేవి శ్రీ ప్రసాద్' రావడం విశేషం. ఆ తర్వాత హస్ మేట్స్ కి పరిచయం చేసాడు నాగార్జున. "ఈ రోజు మిమ్మల్ని ఆడించడానికి, పాడించడానికి మీకో సర్ ప్రైజ్ ఉందని, దేవిశ్రీని కంటెస్టెంట్స్ కు పరిచయం చేసాడు.
ఆ తర్వాత దేవిశ్రీని చూసి హౌస్ మేట్స్ అందరు ఓ అంటు అరుస్తు, గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు. తర్వాత దేవిశ్రీకి, హౌస్ మేట్స్ అందరు ఒక్కొక్కరుగా పరిచయం చేసుకున్నారు. కాగా ఆదిత్య మాట్లాడుతూ "హాయ్ సర్. దిజ్ ఈజ్ ఆదిత్య, నేను చెన్నై స్కూల్ లో చదివాను. ఆ స్కూల్ లో నేను మీ జూనియర్ ని" చెప్పగానే అవునా అని ఆశ్చర్యంతో దేవిశ్రీ ఉండగా, నాగార్జున మాత్రం అవునా నిజమా అంటు అవక్కయ్యాడు. ఆ తర్వాత నాగార్జున మాట్లాడుతూ స్కూల్ లో దేవి ఎలా ఉండేవాడు? అని సరదగా ఆదిత్యని అడుగగా, "నాకు ఇంట్రెస్ట్ పోయిందండి, ఆ గేమ్ ఏదో ఆడితే నేను వెళ్ళిపోతా" అని దేవి ఫన్నీగా సమాధానమిచ్చాడు.
దేవి తను పాడి, కంపోజ్ చేసిన ప్రైవేట్ ఆల్బమ్ 'ఓ పిల్లా' అనే పాటను రిలీజ్ చేసాడు.ఆ తర్వాత సూర్య తన మిమిక్రీ తో హౌస్ మేట్స్ తో పాటు దేవిని ఇంప్రెస్ చేసాడు. నాగార్జున, సూర్యని మిమిక్రీ చేయమని చెప్పగా మొదటగా దేవి వాయిస్ ని చేసాడు. ఆ తర్వాత 'అల్లు అర్జున్' వాయిస్ ని చేయగా, దేవి మైమరిచిపోయాడు. "వహ్వా ఏం చేసావ్, సూపర్. చాలా బాగా చేసావ్" అని సూర్యని పొగిడేసాడు దేవి. ఆ తర్వాత రేవంత్ పాటతో కాసేపు అలరించాడు. అలా ఒక్కొక్కరుగా వచ్చి తమ ట్యలెంట్ తో అటు దేవికి, ఇటు ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు.