English | Telugu

రేపు అంటే ఏమిటో అప్పట్లో నాకు తెలీదు...ఏ సర్టిఫికెట్ మూవీకి మేం వెళ్తాం

జబర్దస్త్ ఈ వారం కామెడీ షో స్టార్టింగ్ లోనే పంచెస్ పేలాయి. ఈ షోకి "హిడింబా" మూవీ టీమ్ నుంచి నందిత శ్వేతా, అశ్విన్ బాబు, రఘు కుంచె, శ్రీధర్ వచ్చారు. ఇక అశ్విన్ జబర్దస్త్ గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడారు..."నేను ఎప్పుడైనా బాధగా ఉన్నాను అంటే ఆ టైంలో జబర్దస్త్ చూస్తాను" అనేసరికి హోస్ట్ సౌమ్య ఒక ఝలక్ ఇచ్చింది.."ఒకరోజు అశ్విన్ గారు ఫోన్ చేసి మీరు రండి, మీరు రండి" అని అడిగినట్లు చెప్పింది. "దేనికి రమ్మన్నానో చెప్పాలి కదా" అని అశ్విన్ అనేసరికి. "ప్రోగ్రాం ఉంది అందుకే రమ్మన్నారు" అని చెప్పింది. "ఆయన ఎవరో తెలుసా ఓంకార్ వాళ్ళ తమ్ముడు" అని కృష్ణభగవాన్ చెప్పేసరికి "నిజంగా ఓన్ బ్రదరా" అని అడిగింది "లేదండి నాలుగు రోజులకు అద్దెకు తెచ్చుకున్నారు" అని జోక్ వేశారు అశ్విన్ బాబు.

"హిడింబ మూవీలో ఏం ఉంది" అని సౌమ్య అడిగేసరికి "నరమాంస భక్షకుల థీమ్ తో ఈ మూవీ రాబోతోంది...మేము ఏ సర్టిఫికెట్ తో వస్తున్నాం" అని అశ్విన్ చెప్పారు. "ఏ సర్టిఫికెట్ ఉంది అంటే కృష్ణభగవాన్ గారు ఈ మూవీకి వెళ్లొచ్చు అనేసరికి సౌమ్య నేను, సౌమ్య వెళ్తాం" అని ఆయన అశ్విన్ కి చెప్పి నవ్వించారు..దాంతో సౌమ్య సిగ్గుపడిపోయింది. "నరమాంస భక్షకులు"అనే పదాన్ని కరెక్ట్ గా సౌమ్య చేత పలికించారు. "లాంగ్వేజ్ తెలీక ఏదేదో అనేస్తుంది అంతే " అని అన్నారు కృష్ణభగవాన్. అప్పుడు సౌమ్య ఒక విషయాన్ని షేర్ చేసుకుంది.."నేను స్టార్టింగ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు రేపు అనే పదానికి అర్ధం తెలీదు. ఈ విషయంలో మా మేనేజర్ తో నాకు గొడవ అయ్యింది. ఒక రోజు మేనేజర్ వచ్చి రేపు షార్ప్ 8 .30 అనేసరికి ఏంటి రేపు అని సీరియస్ గా అడిగాకా ఆయన చెప్పారు" అనేసరికి అందరూ నవ్వేశారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.