English | Telugu

"మీర‌నుకున్నంత ఈజీ కాదు మా లైఫ్‌".. శివ‌జ్యోతి భావోద్వేగం!

న్యూస్‌ ఛాన‌ల్ వీ6తో వెలుగులోకి వ‌చ్చింది శివ‌జ్యోతి. తెలంగాణ మాండ‌లికంలో తీన్‌మార్ వార్త‌లు చ‌‌దువుతూ త‌న‌దైన స్టైల్లో బిత్తిరి స‌త్తితో క‌లిసి ఆ ప్రోగ్రామ్‌కే వ‌న్నె తెచ్చింది. ప‌లు అవార్డుల్ని, వ్యూయ‌‌ర్స్ ప్ర‌శంస‌ల్ని ద‌క్కించుకుని అన‌తికాలంలోనే పాపుల‌ర్ అయింది. ఆ త‌రువాత బిగ్ బాస్ సీజ‌న్ 3లో అవ‌కాశం రావ‌డంతో వీ6తో త‌న ఉద్యోగానికి రాజీనామా చేసి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

అక్క‌డి నుంచి మ‌రింత‌గా పాపులారిటీని ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం టీవి9లో న్యూస్ ప్ర‌జెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. తాజాగా జీ తెలుగు ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛాన‌ల్ ఉమెన్స్ డే సంద‌ర్భంగా 'మ‌గువా లోకానికి తెలుసా నీ విలువా' పేరుతో ఓ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌దీప్ మాచిరాజు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించారు.

వివిధ రంగాల్లో ధైర్యసాహ‌సాల్ని ప్ర‌ద‌ర్శించి ముద‌డుగు వేస్తూ ప‌ది మందికి ఆద‌ర్శంగా నిలిచిన మ‌గువ‌ల‌ని ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌త్యేకంగా ఆహ్వానించారు. ఈ కార్యక్ర‌మంలో శివ‌జ్యోతి కూడా పాల్గొంది. అయితే స్టేజ్ పైకి భ‌ర్త‌తో క‌లిసి ఎంట్రీ ఇచ్చిన ఆమె ఎందుకో హ‌ర్ట్ అయింది.

"ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ వుంద‌నుకోండీ.. ఆమె ఎక్కువ సంపాదిస్తోంది అనుకోండి. తెలియ‌కుండానే ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ.. ఏ దానికేందిరా అది సంపాదిస్తోంది. దాని మొగుడు కూర్చుని తింటుండు.. అంటారు. మీరు అనుకున్నంత ఈజీ కాదు మా లైఫ్‌లు." అంటూ శివ‌జ్యోతి భావోద్వేగానికి లోనుకావ‌డం అక్క‌డున్న వారంద‌రినీ షాక్‌కు గురిచేస్తోంది. దీనికి సంబంధించిన ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతోంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.