English | Telugu

చెల్లికి వైరల్ ఫీవర్... అమ్మమ్మకు స్టమక్ పెయిన్

"మౌనరాగం" సీరియల్‌తో పరిచయమైన అమ్ములు-అంకిత్‌ గురించి అందరికీ తెలుసు. ఈ జంట చాలా క్యూట్ గా ఉంటూ తెలుగు ఆడియన్స్ ని తమ యాక్టింగ్ తో మెస్మోరైజ్ చేస్తూ ఉంటారు. కొంత కాలం క్రితం వరకు వాళ్ళ అసలు పేర్లు కంటే సీరియల్ పేర్లతోనే ఎక్కువగా పాపులర్ అయ్యారు. వాళ్ళ అసలు పేర్లు ప్రియాంక జైన్-శివ కుమార్. అటు సీరియల్స్ లోనూ ఇటు సోషల్ మీడియాలోనూ ఈ జంట ఫుల్ ఫేమస్.. ఒకరిని విడిచి ఒకరు ఎక్కడికి వెళ్ళరు, ఏదీ కొనరు..అలాంటి వీళ్ళు ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్లారు. ఎందుకు అంటే శివ కుమార్ చెల్లికి ఫీవర్, త్రోట్ ఇన్ఫెక్షన్ కారణంగా ఆమెను తీసుకుని హాస్పిటల్ కి వెళ్లారు ఈ జంట.

వైరల్ ఫీవర్ వచ్చినా , ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినా వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్ళిపోవాలి..ఎక్కువ రోజులు నెగ్లెక్ట్ చేయకూడదు అని చెప్పాడు శివ్..ఇక తన చెల్లికి హాస్పిటల్ లో జరిగే ట్రీట్మెంట్ చూస్తే అమ్మకు కూడా కన్నీళ్లు వచేస్తాయట..అందుకే శివ్ తన అమ్మను, అమ్మమ్మను కార్ లోనే ఉంచేసి తాను మాత్రం హాస్పిటల్ కి వెళ్లి వచ్చాడు. ఐతే తన అమ్మమ్మకు కూడా స్టమక్ పెయిన్ ఉంటుందట అప్పుడప్పుడు...హాస్పిటల్ కి వెళదాం చెక్ చేయిద్దాం అని ఎంత చెప్పినా హాస్పిటల్ కి వద్దు అంటుందట అని చెప్పి కొంచెం ఫీల్ అయ్యాడు. తర్వాత వాళ్ళ అమ్మను, అమ్మమ్మను ఇంట్లో దింపేసి మళ్ళీ హాస్పిటల్ కి వచ్చాడు. అప్పుడు తన చెల్లి హ్యాపీగా నవ్వుతూ బెడ్ మీద పడుకుని కనిపించింది. పక్కనే ప్రియాంక జైన్, శివ్ కుమార్ తమ్ముడు కూర్చుని ఉన్నారు. ఇక ప్రియాంక ఒక కవిత కూడా చెప్పేసింది "అందరికీ నమస్కారం, శివ్ నోట్లో కారం, నా నోట్లో తీపి" అని ఫన్నీగా చెప్పింది ప్రియాంక.

తన చెల్లి ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా కూడా ఇలాగే ఫీవర్ తో వస్తుందట. అలా ఎయిర్ పోర్ట్ నుంచి డైరెక్ట్ హాస్పిటల్ కి వెళ్లి సెలైన్ పెట్టించుకుని తగ్గాక ఇంటికి వస్తుందట అని చెప్పాడు శివ్. ఇలాంటి సీరియస్ టైంలో సడెన్ గా శివ్ కుమార్ తమ్ముడు కూర్చున్న కుర్చీ విరిగిపోయి అతను కింద పడిపోయాడు. ఇక శివ్ తన తమ్ముడు ప్రజ్వల్ తో "అందుకేరా తక్కువ తినాలి" అంటూ కామెడీ చేసాడు. ఇక సెలైన్ ఐపోయాక ఇంటికి వచ్చేసి వాళ్ళ అమ్మను, అమ్మమ్మను హగ్ చేసుకుంది శివ్ కుమార్ సిస్టర్.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.