English | Telugu

చీర పెట్టిన వియ్యపురాలు..గొడవ పెట్టిన కోడలు


సన... బుల్లితెర నటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అటు సీరియల్స్ లో నటిస్తూ ఉంటుంది ఇటు సిల్వర్ స్క్రీన్ మీద రకరకాల సైడ్ క్యారెక్టర్స్ లో కనిపిస్తూ ఉంటుంది. అలాంటి సన ఇప్పుడు తన అపార్ట్మెంట్ లో జరిగే వినాయక చవితి వేడుకల్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నట్టు ఒక వీడియో చేసి తన యూట్యూబ్ ఛానల్ లో అప్ లోడ్ చేసింది.

అందులో తన వియ్యపురాలు కూడా ఈ ప్రోగ్రాంకి రావడాన్ని చూపించారు. అలాగే పిల్లలను ఇచ్చిన వియ్యపురాలు వచ్చి సనకి గిఫ్టులు ఇచ్చారు. అలాగే ఒక మంచి చీర దాంతో పాటు 1000 రూపాయలు కూడా ఇచ్చారు. ఇక సన ఆ చీరను చూసి మురిసిపోయింది. ఆ కలర్ తన దగ్గర లేదని చెప్పింది. ఇక వాళ్ళ అపార్ట్మెంట్ లో పెట్టిన షాపింగ్ మాల్ ని అందరూ చూసారు. అలాగే గంటలతో తయారు చేసిన వినాయకుడిని కూడా చూపించింది సన.

ఇక సన ఇంటికి చాలా మంది చుట్టాలు వచ్చి రకరకాల వంటలు చేశారు..ఇక కోడలు సమీరా, కూతురు తబుస్సామ్ ఇద్దరూ తిని చూపించారు. అలాగే చీటికీ మాటికీ అత్తగారు సనతో గోడపాడుతూనే ఉంది కోడలు సమీరా. అలాగే కూతురు, కోడలు చానెల్స్ ని సబ్స్క్రయిబ్ చేసుకోమని తన ఛానల్ ద్వారా ప్రమోట్ చేసుకుంది సన..సనా కృష్ణవంశీ తెరకెక్కించిన రంగమార్తాండ చిత్రంలో కీలక పాత్రలో నటించింది. సనాకి హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయి. కానీ అక్కడ పరిస్థితులు నచ్చక, అలాగే హీరోయిన్ కావాలంటే స్విమ్ సూట్ లో కనిపించాలి, బాగా ఎక్స్ పోజ్ చేయాలి అనేసరికి ఆ ఆఫర్స్ ని వదులుకుంది సన. ఆమె `మెట్రో క‌థ‌లు` వెబ్ సిరీస్ లో రొమాంటిక్ రోల్ లో కనిపించేసరికి అందరూ షాకైపోయారు. స‌హ న‌టుడు అలీ రెజాతో కలిసి రొమాంటిక్ సీన్స్ లో యాక్ట్ చేసి తన ఫాన్స్ కి షాకిచ్చారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.