English | Telugu

నాకు పుట్టే బిడ్డకు మేఘన అని పేరు పెట్టుకుంటాను

మహబూబ్ నగర్ లో పడమటి సంధ్యారాగం టీమ్ అక్కడికి వచ్చిన అశేష ప్రజానీకం మధ్య సెలెబ్రేషన్స్ చేసుకుంది. ఇక వీళ్ళ మధ్యనే జానకి అత్తా పుట్టినరోజు వేడుకను కూడా నిర్వహించారు. ప్రజలంతా వచ్చి ఈ వేడుకను చూసారు. అలాగే ఈ టీమ్ ని విష్ చేశారు. అలాగే ఇందులో రాము రాథోడ్ స్టేజి మీదకు వచ్చి "రాను ముంబైకి రాను" అనే సాంగ్ పాడి అందరినీ ఎంటర్టైన్ చేసాడు. అలాగే ఈ ఈవెంట్ లో ఒక అభిమాని వచ్చి మేఘనతో ముచ్చటించారు. అమ్మానాన్న ప్రేమ తరువాత ఫాన్స్ ప్రేమ చాలా ప్యూర్ గా అనిపిస్తుంది. స్టేజి మీదకు వచ్చి చామంతి పూల దండను మేఘన మేడలో వేశారు. "నాకు పుట్టే బిడ్డకు మేఘన అని పేరు పెట్టుకుంటాను" అని చెప్పింది.

తర్వాత మేఘన మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది. "మా నాన్నను దేవుడు తొందరగా తీసుకెళ్లిపోయాడు. కానీ ఆ ప్రేమను నాకు వీళ్ళ రూపంలో ఇచ్చినందుకు" అని చెప్తూ స్టేజి మీదనే ఏడ్చేసింది. ఇక సీరియల్ లో ఆద్య రామలక్ష్మికి ఒక సర్ప్రైజ్ ని ఈ స్టేజి మీద ఇచ్చింది. ఆద్య మాట్లాడుతూ "రామ డ్రామా జూనియర్స్ లో చాల ఫీలయ్యింది. తన నాన్నతో ఒక్క సెల్ఫీ కూడా లేదు అని. కానీ ఈరోజు నేను ఆమె విష్ ని ఫుల్ ఫీల్ చేద్దామనుకుంటున్నా" అంటూ రామలక్ష్మి వాళ్ళ నాన్నతో కలిసి ఉన్న ఒక ఫోటోని లామినేషన్ చేయించి ఆ స్టేజి మీద ఆద్య రామలక్ష్మికి ఇచ్చింది. తర్వాత రామలక్ష్మి తన పేరెంట్స్ తనకు ఫెవరేట్ అని చెప్పింది. వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే అంది. అలా మహబూబ్ నగర్ లో పడమటి సంధ్య రాగం సీరియల్ తో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.