English | Telugu

అనుపమ పరమేశ్వరన్‌తో సంతోష్ శోభన్ వాట్సాప్ చాట్‌ని లీక్ చేసిన సుమ!

యాంకర్ సుమ నిన్న మొన్నటి వరకు 'క్యాష్'షోతో ఎంటర్టైన్ చేసింది. ఇక ఈ ప్రోగ్రాంకి కొంచెం బ్రేక్ ఇచ్చి ఇప్పుడు 'సుమ అడ్డా'పేరుతో కొత్త ఎంటర్టైన్మెంట్ షో స్టార్ట్ చేసింది. ఈ షో 7వ తేదీ నుంచి ప్రతీ శనివారం రాత్రి 9.30 నిమిషాలకు ప్రసారం కాబోతోంది. సుమ ఎనెర్జీ గురించి, వేసే పంచెస్ గురించి, స్పాంటేనిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇదివరకు శనివారం పూట 'క్యాష్' షో వచ్చేది. ఇప్పుడు దీని ప్లేస్‌లో ఈ కొత్త షో ఎంటర్టైన్ చేయబోతోంది. ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది.

మరి కొద్ది రోజుల్లో రాబోతున్న సంక్రాంతి పండగ సందర్భంగా రిలీజ్ కాబోతున్న 'కళ్యాణం కమనీయం'మూవీ టీమ్ ఈ షోలో సందడి చేశారు. హీరో సంతోష్ శోభన్, హీరోయిన్ ప్రియా భవాని శంకర్‌తో పాటు డైరెక్టర్ అనిల్‌కుమార్ ఆళ్ల కూడా వచ్చారు. ఈ ప్రోమో చాలా ఎంటర్టైన్ చేసింది.

ఫైనల్‌గా సంతోష్ శోభన్ వాట్సాప్ చాట్‌ని సుమ లీక్ చేసేసింది. ఇందులో అనుపమ పరమేశ్వరన్‌తో చేసిన చాట్ మొత్తాన్ని చదివి వినిపించింది. అలాగే సన్నీ లియోన్‌కి మెసేజెస్ పెట్టి డిలీట్ చేసినవి ఎన్నో కూడా లెక్కబెట్టి చెప్పింది. ఇక ఈ షోకి వచ్చిన స్టూడెంట్స్‌ని "లవ్ మ్యారేజ్ గొప్పదా? అరేంజ్డ్ మ్యారేజ్ గొప్పదా?" అని అడిగింది. వాళ్ళ ఆన్సర్స్‌కి చాక్లెట్స్ కూడా ఇచ్చింది. ఎవరికి నచ్చిన ఆన్సర్స్ వాళ్ళు చెప్పారు. తర్వాత వాళ్ళతో ఫన్నీ గేమ్స్ కూడా ఆడించింది సుమ.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.