English | Telugu

సీతారామయ్య ఫోన్ తో వెనుతిరిగిన రాజ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ ఎపిసోడ్ -4 లోకి అడుగు పెట్టింది. శుక్రవారం నాటి ఎపిసోడ్ లో రాజ్, కళ్యాణ్ ఇద్దరు కలిసి కృష్ణమూర్తి షాప్ ని వెతుక్కుంటూ వెళ్తారు.

రాహుల్ అతని తల్లి కలిసి సీక్రెట్ గా మాట్లాడుకుంటారు. "మనం అసలు దుగ్గిరాల ఫ్యామిలీ వాళ్ళం కాదు. ఒంటరిగా ఉన్న మనల్ని చేరదీసి ఇంట్లో స్థానం కల్పించారు. మనం కూడా ఈ ఫ్యామిలీలో మంచి పేరు తెచ్చుకొని ఆస్తులు మొత్తం మన సొంతం చేసుకోవాలి" అని మాట్లాడుకుంటారు.

షాప్ వెతుక్కుంటూ వచ్చి చూస్తే ఆ షాప్ కావ్యదే అయ్యి ఉంటుంది. అ షాప్ లో కావ్యని చూసి రాజ్ తిరిగి వస్తుంటాడు. అలా కోపంతో వెనుతిరిగి వస్తుంటే.. కళ్యాణ్ ఆపుతాడు. "ఇప్పుడు మన అవసరం. నేను మాట్లాడుతాను" అంటూ కావ్య తో "వినాయకుడికి నగలు డిజైన్ చెయ్యడానికి మీరు రండి" అని చెప్పగానే కావ్య నిరాకరిస్తుంది. "మేము దుగ్గిరాల ఫ్యామిలీ.. మీకు తెలుసా" అని అనగానే... కనకం అన్న మాటలు గుర్తు చేసుకుంటుంది కావ్య. ఆ తర్వాత కావ్యతో ఆర్గుమెంట్ చేస్తూ.. అసలు తనని తాను తగ్గించుకోకుండా ఎక్కడా కూడా తగ్గకుండా మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతుంటాడు రాజ్. అంతలోనే సీతారామయ్య ఫోన్ చేసి "ఎలాగైనా పూజ జరగాలి" అని చెప్తాడు. అప్పుడే కావ్యకి కనకం ఫోన్ చేసి ఎలాగైనా పాస్ లు వచ్చేలా చెయ్ అనడంతో కావ్య సరే అంటుంది. రాజ్ మళ్ళీ తిరిగి కావ్య దగ్గరికి వస్తాడు. రాజ్ కేమో వినాయకుడి నగలు డిజైన్ చెయ్యాలి. కావ్యకేమో రాజ్ వాళ్ళ ఇంట్లో జరిగే పూజకి వెళ్ళడానికి ఎంట్రీ పాస్ లు కావాలి. ఇలా ఇద్దరిది అవసరమే. కావ్య డిజైన్ చేయడానికి వెళ్తుందా? రాజ్ కనకం కుటుంబానికి ఎంట్రీ పాస్ లు ఇస్తాడా? లేదా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే...

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.