English | Telugu

కన్నపేగు బంధాన్ని చూపిస్తూ కంటతడి పెట్టించిన జగతి, రిషి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -881 లో.. ఫణింద్ర వాళ్లని ఇంటికి వెళ్ళండని‌ రిషి చెప్తాడు. ఈ సిచువేషన్ లో ఎలా ఇంటికి వెళ్తామని ఫణింద్ర అంటాడు. మీరు ఈ విషయం తెలియగానే హడావిడిగా వచ్చేసారు కదా, ఏం తిని ఉండరు వెళ్ళండని రిషి చెప్పగానే.. సరే ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చెయ్యండని చెప్పి ఫణింద్ర వాళ్ళు వెళ్తారు.

ఆ తర్వాత రిషి, మహేంద్రల కోసం హాస్పిటల్ కి చక్రపాణి భోజనం తీసుకొని వస్తాడు. రిషి సర్, మహేంద్ర సర్ భోజనం చెయ్యండని వసుధార అనగానే.. లేదు, ఆకలిగా లేదు ఈ సిచువేషన్ లో భోజనం చెయ్యాలని ఎలా అనిపిస్తుందని మహేంద్ర అంటాడు. ఆ తర్వాత వసుధార బలవంతపెట్టడంతో రిషి, మహేంద్ర ఇద్దరు భోజనం చేస్తారు. మరొకవైపు జగతి దగ్గరికి వెళ్లిన చక్రపాణి.. మీకేం కాదు, మీరు బాగుంటారని అనుకుంటు బాధపడతాడు. కాసేపటికి మహేంద్ర, రిషి ఇద్దరు భోజనం చేసి వస్తారు. మా గురించే కాదు నీ గురించి కూడా ఆలోచించుకోవాలని, నువ్వు కూడా భోజనం చేయమని వసుధారకి రిషి చెప్తాడు. మీరు నాకు దూరం అయ్యారని, మేడమ్ ని నేను దూరం పెట్టి, చాలా బాధపెట్టానని వసుధార బాధపడుతుంది. ఆ తర్వాత అక్కడికి డాక్టర్ రాగానే.. అతనితో జగతి ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడతాడు. కాసేపటికి జగతి దగ్గరికి రిషి వెళ్తాడు. జగతిని ఈ సిచువేషన్ లో చుసిన రిషి బాధపడతాడు.. మిమ్మల్ని చాలా బాధపెట్టాను. నా కోసం మీరు ప్రాణాలకి తెగించి నన్ను కాపాడారు ఇప్పుడు మీరు ఈ సిచువేషన్ లో ఉన్నారు. నేను చాలా పెద్ద తప్పు చేశాను అమ్మ అని రిషి ఎమోషనల్ అవుతాడు.

మరొకవైపు రిషి ఎక్కడ అని మహేంద్ర, వసుధార చూస్తుంటారు. అప్పుడే జగతి చెయ్యి పట్టుకొని అమ్మ అని రిషి బాధపడడం చూసి.. జగతి ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్నదని, తను ఈ పరిస్థితిలో ఉండగా నిజం అయిందని మహేంద్ర బాధపడతాడు. కాసేపటికి జగతి దగ్గర నుండి రిషి వస్తుంటే ఇంకా కాసేపు ఉండమని మహేంద్ర అంటాడు. లేదు.. డాక్టర్ ఎక్కువ సేపు వద్దన్నాడని ముగ్గురు వెనక్కి తిరుగుతారు. రిషి అని ఒక్కసారిగా జగతి అనగానే.. రిషికి ప్రాణం లేచినట్లు అనిపిస్తుంది. అమ్మ అంటూ రిషి ఎమోషనల్ గా జగతి దగ్గరికి వస్తాడు. ఆ పిలుపు విని జగతి ఎమోషనల్ అవుతుంది. మళ్ళీ పిలవమంటూ రిషి చేత మళ్ళీ మళ్ళీ అమ్మ అని పిలిపించుకుంటుంది జగతి. నా కొడుకు నన్ను అమ్మ అన్నాడని మహేంద్రతో జగతి చెప్తూ మురిసిపోతుంది.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.