English | Telugu

రిషి, వసుధారల ఎంగేజ్ మెంట్ కి దేవయాని ఏర్పాట్లు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -762 లో.. నేను ఈ పరిస్థితుల్లో ఎంగేజ్ మెంట్ చేసుకోను.. ఇన్ని రోజులగా రిషి సర్ ని ప్రేమిస్తుంది.. ఇలా భయం భయంగా పెళ్ళి చేసుకోవడానికేనా అని జగతి తో వసుధార అంటుంది. ఇవన్నీ తర్వాత ఆలోచిద్దాం.. నువ్వు, రిషి ఎంగేజ్ మెంట్ చేసుకోండని జగతి అంటుంది. అలా చెప్పగానే వసుధార సైలెంట్ గా అక్కడ నుండి వెళ్ళిపోతుంది.

మరొకవైపు రిషి ఒంటరిగా తన గదిలో ఉండి ఆలోచిస్తుంటాడు. వసుధార తన గదిలోకి వచ్చి.. రిషిని వెనకాల నుండి హగ్ చేసుకుంటుంది. ఏమైంది వసుధార.. ఎందుకు ఎంగేజ్ మెంట్ వద్దని అంటున్నావ్.. కారణమేంటని రిషి అడుగుతాడు. వసుధార ఏడుస్తూ.. మీ గురించే అలోచించి అలా అన్నానని వసుధార అంటుంది. మీ కాలేజీ ఆశయాలు మీకు ఉన్నాయి.. కానీ ఇప్పుడు ఇదంతా ఎందుకని వసుధార అంటుంది. నాకు కాలేజీ.. నువ్వు రెండు ఒకటే.. రెండింటిని బాలన్స్ చేసే సామర్థ్యం నాకు ఉంది. ఇప్పటికే మన మధ్య డిస్టబెన్స్ వచ్చాయి. ఇక లేట్ చెయ్యొద్దు.. నిన్ను దూరం చేసుకోలేనని రిషి అంటాడు. రిషి అలా మాట్లాడగానే వసుధార తనని హగ్ చేసుకుంటుంది.

మరొకవైపు దేవయాని ఎంగేజ్ మెంట్ కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అది చూసిన ఫణింద్ర.. నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎంగేజ్ మెంట్ కి ఇలా చేస్తున్నావ్.. పెళ్లి ఇంకెంత గ్రాండ్ గా చేస్తావో అని ఫణింద్ర అంటాడు. మీరే చూస్తారు కదా అని దేవయాని అంటుంది. ధరణి దగ్గరికి దేవయాని వెళ్ళి.. ఇంకా ఇక్కడే ఉన్నావా.. రేపు ఎంగేజ్ మెంట్ అనే విషయం మర్చిపోయావా? ఏం పట్టించుకోవట్లేదంటూ ధరణిపై కోప్పడుతుంది దేవయాని. ఆ తర్వాత వసుధారకి చీరని ఇచ్చి.. రేపు ఎంగేజ్ మెంట్ కి ఇదే కట్టుకోమని రిషి చెప్తాడు. ఏంటి డల్ గా ఉన్నావ్.. మన ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా చెయ్యాలని పెద్దమ్మ చూస్తుంది.. నువ్వేమో డల్ గా ఉన్నావ్.. ఇలా ఉండకు.. ఈ పొగరు హ్యాపీగా ఉంటేనే.. మీ ఎండి గారు హ్యాపీగా ఉండేది.. అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండమని రిషి అంటాడు. జగతి, ధరణి ఇద్దరు పూలు గుచ్చుతుంటే.. వసుధార వచ్చి రిషి ఇచ్చిన చీరని చూపిస్తుంది. ఇక్కడ పూలు గుచ్చుతున్నారు.. మీరు రండి అని రిషికి వసుధార మెసేజ్ చేయగానే రిషి వస్తాడు. రిషి రాగానే జగతి, ధరణిలు వెళ్ళిపోతారు. వసుధార, రిషి లు మాట్లాడుకుంటుండగా దేవయాని వచ్చి.. నిన్ను శైలేంద్ర రమ్మంటున్నాడని రిషి తో చెప్పగానే.. రిషి అతని దగ్గరికి వెళ్తాడు.

శైలేంద్ర రిషిని ఏదో ఫైల్ మీద సంతకం కావాలని అడుగుతాడు. రిషి సంతకం పెట్టబోతుంటే జగతి వచ్చి వద్దని అంటుంది. అన్ని చూసి సంతకం చెయ్యాలి.. చూసుకోకుండా అలా చెయ్యద్దని జగతి అనగానే.. రిషి అన్ని పేపర్స్ చెక్ చేసి, అన్ని కరెక్ట్ గానే ఉన్నాయని సంతకం పెడతాడు. మరుసటి రోజు ఉదయం. ఈ శైలేంద్ర ఏం ప్లాన్ చేస్తున్నాడో అని జగతి ఆలోచిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.