English | Telugu

దేవత అడవిలో ఉండి ఏం చేస్తోంది ? అప్సరను అడిగిన ఆర్జీవీ

టెంప్టింగ్ హాట్ బ్యూటీ అప్సర రాణి గురించి ఇప్పుడు అందరికీ తెలుసు. వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కారణంగా అమ్మడు లైం లైట్ లోకి వచ్చింది. అలాగే రవితేజ హీరోగా వచ్చిన "క్రాక్" మూవీలో ఐటెం సాంగ్ చేసే ఛాన్స్ కొట్టేసింది. తర్వాత సుధీర్ బాబు హంట్ మూవీలో కూడా ఐటెం సాంగ్ లో మెరిసింది. ఇక ఆర్జీవీ డైరెక్ట్ చేసిన 'డేంజరస్' మూవీతో ఆడియన్స్ లో హీట్ పుట్టించేసింది. అలాంటి అందాల ఆటం బాంబు ఇప్పుడు "తలకోన" అనే మూవీలో కనిపించబోతోంది. దానికి సంబంధించిన ఒక పిక్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఆ పిక్ ని చూసిన రామ్ గోపాల్ వర్మ ఒక ప్రశ్న వేశారు.."హే..నీ ఫిలిం పోస్టర్ తలకోన చాలా బాగుంది.

కానీ ఒక దేవత అడవిలో ఉండి ఏం చేస్తోంది ?" అని అడిగారు. "నాలో మీరు ఎప్పుడూ చూడని కోణాన్ని చూసి కచ్చితంగా థ్రిల్ ఫీలవుతారు. ఇందులో చాలా యాక్షన్ సీన్స్, ఫైట్స్ కూడా ఉంటాయి" అని అమ్మడు ఆర్జీవీకి ఆన్సర్ కూడా ఇచ్చింది. అప్సర హాట్ గా కనిపించే విషయంలో ఎలాంటి మొహమాటం కూడా పడదు. ఇక ఈ తలకోన మూవీ నగేష్ నారదాస్ డైరెక్షన్ లో రాబోతోంది. ప్రకృతి అందాల మధ్య కొత్త స్టోరీతో రాబోతున్నాం అని మేకర్స్ చెప్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంగా సాగే ఈ కథాంశం మొత్తం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది. ఈ మూవీలో పాలిటిక్స్ ని కూడా మిక్స్ చేసి చూపించామంటున్నారు డైరెక్టర్. మెయిన్ స్టోరీ ఏమిటంటే, తలకోన ఫారెస్ట్ లోకి హీరోయిన్ ఎంత మందిని తీసుకుని అడవికి వెళ్ళింది, ఎంతమందితో కలిసి తిరిగి వచ్చింది అనేది మెయిన్ పాయింట్ అని చెప్పారు. మరి ఆర్జీవీ హీరోయిన్ ఈ మూవీ ద్వారా ఎలా కనిపించబోతోందో తెలియాలి అంటే కొన్ని డేస్ వెయిట్ చేయాలి.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.