English | Telugu
బాహుబలి కట్టప్పను క్రాస్ చేసిన రతిక!
Updated : Oct 2, 2023
బిగ్ బాస్ సీజన్-7 లో కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ హాట్ టాపిక్ గా మారుతుంది. ఇక ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. కిరణ్ రాథోడ్, షకీల, దామిణి మూడు వారాల్లో ఎలిమినేట్ అవ్వగా నాల్గవ వారం రతిక ఎలిమినేట్ అయింది.
ఎన్నో అంచనాల మధ్య, మరెన్నో ట్రోల్స్ మధ్యలో హౌజ్ నుండి బయటకొచ్చిన రతిక ఎగ్జిట్ ఇంటర్వ్యూ ప్రోమో వచ్చేసింది. బిబి బజ్ ఇంటర్వ్యూ గీతు రాయల్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే హౌజ్ లో రతికతో ఎవరెవరు ఎలా ఉన్నారో కొన్ని విషయాలను పంచుకుంది. రతిక జర్నీ వీడియోలో తొంభై శాతం పల్లవి ప్రశాంత్ తో రతిక గడిపిన క్షణాలనే ఉంచారు. పల్లవి ప్రశాంత్ తో రతిక ఎంతలా ఉందోనని దీన్ని బట్టే తెలుస్తుంది. అయితే తన నెగెటివ్ మైండ్ సెట్ తో తోటి కంటెస్టెంట్స్ ఇబ్బంది వల్లే బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకు తన మీద బ్యాడ్ ఇంపాక్ట్ పడిందనేది తెలుస్తుంది.
మీరు హౌజ్ లో అందరిని వాడుకొని ఆడుకోవాలనుకున్నారు కానీ చివరికి వాడిపోయారని గీతు రాయల్ అంది. బహుబలి సినిమా ఇష్టమా అని గీతు రాయల్ అడుగగా.. ఇష్టమని రతిక అంది. బహుబలిలో కట్టప్పని క్రాస్ చేశారని అనిపించిందని గీతు రాయల్ అనగానే.. రతిక షాక్ అయింది. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు, పల్లవి ప్రశాంత్ కి మొదట చెయ్యి అందించింది నువ్వేనని రతికతో గీతు రాయల్ అనగా.. నేనా అంటూ ఆశ్చర్యపోయింది రతిక. ఇక అలా తను మాట్లాడటం చూసి.. మీరు ఇక్కడ కూడా మానిపులేట్ చేస్తున్నారని అనిపిస్తుందని గీతు రాయల్ అంది. ఎక్స్ అనే ఎమోషన్ ని బాగా వాడుకున్నట్టనిపించిందని గీతు అనగా.. వాడుకునే టైమ్ వస్తే వాడుకుంటానని రతిక అంది. తమ్ముడు తమ్ముడు అని చెప్పి ప్రశాంత్ తో పేకాట ఆడావని గీతు రాయల్ అనగా.. అదేం లేదని రతిక అంది. ప్రశాంత్ క్రైయింగ్ స్టార్ అయితే నువ్వు కన్నింగ్ స్టార్, నీ కన్నా పాము బెటర్ అని గీతు రాయల్ అనగా అవునా రతిక అంది.