English | Telugu

మరో వివాదంలో చిక్కుకున్న యాంకర్ రష్మీ!

యాంకర్ రష్మీగౌతమ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ ఆకట్టుకునే ఈయాంకర్ ..సుధీర్ లవ్ స్టోరీ పేరుతో కుర్రాళ్లకు మంచి స్టఫ్ గా మారిపోయింది. అన్న, వదిన అంటూ వీళ్లిద్దరి మధ్య లేని పోని వరసలు కలిపేస్తు కామెంట్స్ పెడుతుంటారు.

సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్ గా.. స్మాల్ స్క్రీన్ పై యాంకర్ గా రెండు చేతుల డబ్బులు సంపాదిస్తున్న రష్మి.. పలు సేవ కార్యక్రమాలకు తన మద్దతు ఇస్తూ మెసేజ్ లు పెట్టడం, మూగ జీవాల పట్ల తనకున్న ప్రేమను చాటుకుంటూ సెలబ్రిటీగా మారిపోయింది. సినిమాలు, టీవీ షోలతో బిజిగా ఉంటూనే మరోవైపు రష్మీ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు షాకింగ్ పోస్ట్ లు పెడుతూ నెటిజన్ల కళ్లలో పడుతుంది. తాజాగా నెట్టింట్లో ఓ వీడియో ట్రెండ్ కాసాగింది. అందులో ఓ వ్యక్తి గన్ను పట్టుకుని ఆవుని షూట్ చేస్తూ ఉన్నాడు. ఈ వీడియోని షేర్ చేసిన నెటిజన్‌కు రష్మీ రిప్లై ఇచ్చింది. హిందువులుగా మనం ఇది జరగనిచ్చి ఉండాల్సింది కాదు. ఇదంతా మన తప్పే అన్నట్టుగా రష్మీ చెప్పుకొచ్చింది. రష్మీ వేసిన ట్వీట్ మరో నెటిజన్ సెటైరికల్‌గా స్పందించాడు. మహిళలను వివస్త్రలను చేస్తే, మానభంగాలు చేస్తుంటే.. చిన్న పిల్లలపై అత్యాచారాలు చేస్తుంటే స్పందించరు కానీ ఇలా కుక్కలు, ఆవులకు ఏమైనా అయితే మాత్రం వెంటనే స్పందిస్తుంటారు.. ఏ చెప్పుతో కొట్టాలి అంటూ రష్మీని దారుణంగా ట్రోల్ చేశాడు. అలాంటి వ్యక్తికి రష్మీ రిప్లై ఇచ్చింది. బ్రెయిన్ వాడండి.. ఈ రోజులు ఆవులు, కుక్కలు, రేపు మీ పిల్లలు.. ఒకసారి ఒక మనిషిని చంపడానికి సిద్దం అయితే.. వాడికి మనిషికి పశువుకి తేడా కనిపించదు.. అక్కడ ఏ ధర్మం పనికి రాదు అంటూ కౌంటర్లు వేసింది రష్మీ.

గతంలో కూడా చీర కట్టుకొని జై శ్రీరాం అంటూ నినాదాలు చేసిన వీడియోపై రష్మీని విపరీతంగా ట్రోల్స్ చేసారు నెటిజన్లు. ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది ఈ భామ. ఈ ట్రోల్స్ రష్మీకి కొత్తేమీ కాదు .. తను మూగజీవాలపై చూపించే కేరింగ్ చూసి కొందరు మగాళ్ళైతే దారుణంగా కామెంట్లు చేస్తుంటారు. అయితే ఇలాంటివేవీ పట్టించుకోకుండా యాంకరింగ్ చేసుకుంటూ.. సినిమాలలో ఛాన్స్ వస్తే చేయడానికి రెడీ అన్నట్టుగా ఉంది ఈ భామ.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.