English | Telugu

స్టేజీపై రచ్చ రచ్చ చేసిన రష్మీ, సౌమ్యరావు


సిల్వర్ స్క్రీన్ కి తగ్గట్టుగానే బుల్లితెర కూడా పోటీ పడుతోంది. ఎన్నో కొత్త షోస్ తో అలరిస్తూ ఉంది. జబర్దస్త్ తర్వాత స్టార్ట్ ఐన షో శ్రీదేవి డ్రామా కంపెనీ. ఈ షో ఎప్పటికప్పుడు కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. ఇక ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ 100వ ఎపిసొడ్ ప్రసారం కాబోతోంది. ఇక ఈ ఎపిసోడ్ ని స్పెషల్ గా డిజైన్ చేశారు. జబర్దస్త్ యాంకర్ సౌమ్యారావుతో పాటు రష్మీ చేసిన మాస్ డ్యాన్స్ షో ఈ ఎపిసోడ్ మొత్తానికి హైలైట్ గా నిలిచింది.

రష్మీ తనదైన స్టైల్లో మాస్ డ్యాన్స్ తో స్టేజిని అల్లాడించింది. పుష్ప సినిమాలోని చూపే బంగారమాయనే శ్రీవల్లీ పాటకు సౌమ్య లంగా ఓణీ వేసుకుని డాన్స్ చేసింది. ఇక ఆది కూడా ఎప్పుడెప్పుడు సౌమ్యతో డాన్స్ చేద్దామా అన్నట్టుగా ఎదురుచూస్తున్నాడేమో వెళ్లి తనతో కలిసి స్టెప్పేసి తన పంచులతో రెచ్చిపోయాడు. తర్వాత ఇమ్మానుయేల్, వర్ష ఇద్దరూ ఉప్పెన మూవీలోని సాంగ్ కి డాన్స్ చేశారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.