English | Telugu

నిజం నిరూపించాలని ఛాన్స్ ఇచ్చిన రాజ్.. రాహుల్ తప్పించుకున్నాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -94 లో.. రాహుల్ తన నటనతో కావ్యనే తప్పు చేసిందని రాజ్ కు చెప్తాడు. రాహుల్ చెప్పేది కూడా నాకు నమ్మాలని అనిపిస్తుంది.. ఎందుకంటే మీ అక్క తప్పు చేసింది కనుకే ఇక్కడ నుండి పారిపోయింది. రాహుల్ అలా పారిపోలేదు.. ఇక్కడే ఉండి మనకు సమాధానం చెప్తున్నాడని రాజ్ అంటాడు.

ఇన్ని రోజులుగా నిన్ను ఎంత అవమానించిన భరించావు.. నిజాన్ని నిరూపిస్తా అంటూ చెప్పుకోచ్చావ్.. ఇన్ని రోజులు నువ్వు చెప్పిందేది పట్టించుకోలేదు.. కానీ నువ్వు ఈ రోజు పూజ నుండి నన్ను తీసుకొచ్చావ్ కాబట్టి నువ్వు చెప్పేదాంట్లో కూడా నాకు నిజం ఉందేమోననిపిస్తుంది కానీ ఈ ఒక్క రీజన్ పట్టుకొని చిన్నప్పటి నుంచి నాతో పెరిగిన రాహుల్ ని అనుమానించలేను.. కాబట్టి నీకో ఛాన్స్ ఇస్తున్న నిజంగా రాహుల్ తప్పు చేసాడని స్వప్నతో నిరూపించు.. అప్పుడు నువ్వు చెప్పింది నేను నమ్ముతానని రాజ్ అనగానే.. వాళ్ళకి ఇంకొక ఛాన్స్ ఎందుకు ఇస్తున్నావ్.. వాళ్ళు నిన్ను మానిపులేట్ చేస్తున్నారని రాహుల్ అంటాడు.. కావ్యకి ఛాన్స్ ఇస్తే నీకు ఎందుకు భయం అవుతుంది..

తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష.. అదే తప్పు నువ్వు చేస్తే ఈ రాజ్ లో మరొక రూపం చూస్తావని రాహుల్ తో అంటాడు. ఆ తర్వాత కావ్యను తీసుకొని రాజ్ గుడికి వెళ్తాడు. అక్కడ రాజ్, కావ్య ఇద్దరు వెళ్ళగానే.. ఎక్కడికి వెళ్లారని అందరూ అడుగుతారు. నిజానిజాలు తెలియకుండా అక్కడ జరిగింది.. అంతా ఇక్కడ చెప్పడం కరెక్ట్ కాదని కావ్యని నేనే తీసుకెళ్ళానని రాజ్ అంటాడు. ఆ తర్వాత రాజ్ మంగళసూత్రం కావ్య మెడలో వేస్తాడు. ఆ తర్వాత అందరూ ఇంటికి బయలుదేరి వెళ్తారు. కావ్య తన గదిలో బట్టలు సర్దుతుండగా రాజ్ తన దగ్గరికి వెళ్లి.. రాహుల్ గురించి ఇంట్లో ఎవరికీ చెప్పకని అంటాడు. రాహుల్ విషయం బయటపెట్టాలనే కదా నా ప్రయత్నం అని కావ్య అంటుంది. అంత క్లారిటీగా చెప్పినా మీరు నమ్మట్లేదని కావ్య అంటుంది. అది నిందనో లేక నిజమో నువ్వు నిరూపించాలని కావ్యతో రాజ్ అంటాడు.

మరొకవైపు కృష్ణమూర్తి, కనకం ఇద్దరు.. స్వప్న మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందని ఎదురుచూస్తూ ఉంటారు. అప్పుడే స్వప్న ఇంటికి వస్తుంది. ఎక్కడికి వెళ్ళావే అని కనకం అడుగుతుంది. ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళానని స్వప్న చెప్తుంది. నేనొక పెళ్ళి సంబంధం తెచ్చాను.. కచ్చితంగా ఆ అబ్బాయినే నువ్వు పెళ్లి చేసుకోవాలని కృష్ణమూర్తి అంటాడు. అదే మీ నిర్ణయమైతే.. నేను ఆ పెళ్లి చేసుకోనని స్వప్న చెప్పి లోపలికి వెళ్తుంది. ఏదేమైనా ఇష్టం ఉన్నా లేకున్నా.. ఆ అబ్బయితోనే పెళ్లి చేస్తానని కృష్ణమూర్తి చెప్తాడు. మరొకవైపు కావ్య, రాహుల్ ఇద్దరు ఒకరికొకరు ఎదురుపడుతారు. ఇద్దరి మధ్య మాటల యుద్ధమే జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.