English | Telugu

'బిబి కేఫ్' యాంకర్ కే చెమటలు పట్టించిన రాజ్!


బిగ్ బాస్ నుండి పన్నెండవ వారం రాజ్ బయటికొచ్చిన విషయం తెలిసిందే. కాగా రాజ్ బయటకొచ్చాక బిబి కేఫ్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. బిగ్ బాస్ లోకి పర్సనాలిటీ డెవలెప్మెంట్ చేసుకోడానికి వెళ్ళాను అని రాజ్ చెప్పగా, "బిగ్ బాస్ అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ షో కాదు. ఇది ఒక రియాలిటీ షో అని యాంకర్ కౌంటర్ వేసాడు.

ఆ తర్వాత యాంకర్ "బిగ్ బాస్ లో డెబ్భై కెమెరాలకు కనిపించకుండా గేమ్ ఆడావ్" అని ప్రశ్నించగా, "అలా కనిపించకుండా ఆడటమే నా గేమ్ ప్లాన్" అని రాజ్ చెప్పగానే యాంకర్ కి పంచ్ పడింది. "కొంతమంది హౌస్ మేట్స్ ని బిగ్ బాస్ రూల్స్ పాటిస్తలేరు అంటూ నామినేట్ చేసావ్. మరి హౌస్ లో నిద్రపోకూడదు. అది కూడా బిగ్ బాస్ రూలే కదా? మరి నువ్వు ఎందుకు నిద్రపోయావ్? కుక్కలు కూడా అరిచాయి. నువ్వు కూడా రూల్స్ పాటించలేదు. హౌస్ లో ఎక్కువ సార్లు కుక్కలు అరిచాయి. అది నీ వల్లే" అని యాంకర్ అడుగగా.. "అస్సలు కాదు" అంటూ రాజ్ మాట మార్చే ప్రయత్నం చేసాడు. ఇలా యాంకర్ అడిగే ప్రతి దానికి తను కన్ఫ్యూజ్ అవుతూ, యాంకర్ ని కన్ఫ్యూజ్ చేసాడు రాజ్.

"నా సపోర్ట్ ఖచ్చితంగా ఫైమాకి, ఆ తర్వాత ఆదిరెడ్డికి ఉంటుంది. నా అభిప్రాయం ప్రకారం రేవంత్ విన్నర్ అవుతాడని అనుకుంటున్నా. టాప్ ఫైవ్ లో ఎవరు అనేది.. ఇంకా నాకు ఒక క్లారిటీ రాలేదు. అందరూ బాగా ఆడుతున్నారు. ఎవరు ఫేక్ గా లేరు. ఎవరి గేమ్ ప్లాన్ వారికి ఉంది. ఎవరికి వారే ఇండివిజువల్ ప్లేయర్స్" అంటూ రాజ్ చెప్పుకొచ్చాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.