English | Telugu

విరూపాక్ష  డ్రామా కంపెనీలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ..చాలా రోజులకు షోలో రచ్చ రవి


సిల్వర్ స్క్రీన్ మీద ఏది ట్రెండింగ్ లో ఉంటుందో దాన్నే బుల్లితెర కమెడియన్స్ అంత తీసుకుని వాటి మీద స్కిట్స్, స్పూఫ్స్ చేస్తూ వాళ్ళు కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. నిన్న మొన్నటి వరకు దసరా సాంగ్ ప్రతీ షోలో కనిపించింది. ఇక ఆ ఫీవర్ తగ్గి ఆ గాలి కాస్త "విరూపాక్ష" మూవీ మీదకు మళ్లింది. రాబోయే వారం శ్రీదేవి డ్రామా కంపెనీలో విరూపాక్ష మూవీ స్పూఫ్ చేశారు. "ఆ మిస్టరీ విలేజ్" థీమ్ తో స్టేజి మొత్తం అష్టదిగ్బంధనం చేసి వాళ్లకు శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళను పిలిపించి మంచి ఎంటర్టైన్మెంట్ ఇప్పించారు హైపర్ ఆది.

ఇక ఈ షోలో ఐశ్వర్య కొంతమంది గర్ల్స్ తో కలిసి "మసక మసక చీకటిలో" అనే సాంగ్ కి వైట్ డ్రెస్ లో డాన్స్ చేసి స్టేజిని హీటెక్కించింది. దానికి ఇంద్రజ "అందంగా డెకరేట్ చేసిన తెల్ల బూల బుట్టలా ఉంది మీ డాన్స్ " అని కాంప్లిమెంట్ ఇచ్చేసింది. ఈ షోకి సోహైల్, సిరి హన్మంత్ తో పాటు రచ్చ రవి కూడా వచ్చాడు. రచ్చ రవి మూవీస్ లో అవకాశాలు వచ్చేసరికి బుల్లితెర మీద అసలు కనిపించడమే మానేసాడు. ఈ షోకి రావడం ఆ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టుకుని "చాలా రోజుల తర్వాత..శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం బాగుంది..ఎంజాయ్" అని పోస్ట్ పెట్టుకున్నాడు.

ఇందులో పంచ్ ప్రసాద్ అమ్రిష్ పూరి గెటప్ లో మంత్రదండంతో బాటిల్ తెచ్చి అందులో దెయ్యాన్ని బంధించేస్తాను అని చెప్పి ఫుల్ ఎంటర్టైన్ చేసాడు. ఇక ఈ షోలో ఒకామె వచ్చి "ష్ గప్ చుప్" మూవీలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం, భానుప్రియ చెప్పే తిట్ల దండకాన్ని చెప్పి బాగా నవ్వు తెప్పించింది. ప్రోమో ఫైనల్ లో మానస్ , విష్ణుప్రియ పవర్ స్టార్ పవర్ ప్యాక్ పెర్ఫార్మెన్స్ చేసి హూషారెత్తించారు. ఇద్దరూ కలిసి " బద్రి" మూవీ నుంచి " ఏ చికీతా" సాంగ్ కి డాన్స్ చేసి ఆడియన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ని అందించారు. నెక్స్ట్ వీక్ ఈ షోలో ఇలా అలరించబోతోంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.