English | Telugu
నిరుపమ్ - శౌర్య కోసం ప్రేమ్ ప్రేమ పాఠాలు!
Updated : Jul 23, 2022
ఎంతో కాలంగా స్టార్ మాలో ప్రసారమవుతూ నంబర్‌వన్ సీరియల్‌గా నిలిచిన కార్తీకదీపం ప్రస్తుతం కొత్త కొత్త మలుపులతో ఆకట్టుకుంటోంది. ఈ రోజు ఎపిసోడ్ ఎలాంటి ట్విస్ట్ లతో సాగనుందో ఒకసారి చూద్దాం. సౌందర్య ఇంటికి వస్తాడు ప్రేమ్. అతనితో హిమ ఎవరూ వినకుండా నిరుపమ్, శౌర్యల పెళ్లి గురించి మాట్లాడుతుంది. "హిమా! ప్రేమ పెరగాలంటే ఇద్దరూ ఒకే చోట ఉండాలి. తరచూ కలుసుకోవాలి, మాట్లాడుకోవాలి. కళ్లల్లో కళ్లు పెట్టి చూసుకోవాలి" అంటూ ప్రేమ పాఠాలు చెబుతాడు ప్రేమ్. ఆ తరువాత నిరుపమ్ - శౌర్యలని కలపడానికి ఏదో ప్లాన్ చెబుతాడు.
సీన్ కట్ చేస్తే.. ఆనందరావు సోఫాలో నీరసంగా ఉంటారు. నిరుపమ్ కంగారుగా వచ్చి అక్కడే వున్న శౌర్యని చూస్తాడు. ప్రేమ్, హిమ ఆ సీన్ చూసి సూపర్ అనుకుంటారు. ఇంతలోనే అక్కడి నుంచి శౌర్య వెళ్లిపోతుంది. `దేవుడా.. ప్లాన్ ఫెయిల్` అని ఫీలవుతారు హిమ, ప్రేమ్. అది గమనించిన సౌందర్య, ఆనందరావులు కూడా ఫీలవుతారు. హిమ, ప్రేమ్ ఏం ప్లాన్ చేశారు?.. నిరుపమ్ ఎందుకు వచ్చాడు?.. శౌర్య ఎందుకు బయటికి వెళ్లింది? అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.
నిరుపమ్ తో శౌర్య పెళ్లి చేయాలని, ఇద్దరిని కలపాలని హిమ ప్రయత్నాలు చేస్తుంటుంది. తనకి ప్రేమ్ తోడవ్వడంతో కథనం రసవత్తర మలుపులు తిరుగుతోంది. ప్రేమ్ చేసే ప్రయత్నంలో హిమ దగ్గరవుతుందా?.. నిరుపమ్, శౌర్య కలుస్తారా?.. హిమ అనుకున్నట్టే ఒక్కటవుతారా?.. శౌర్య ప్రేమ గెలుస్తుందా?.. డాక్టర్ బాబు నిరుపమ్ మనసు మార్చుకుంటాడా? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.