Read more!

English | Telugu

మాది దొంగ పెళ్లి.. గర్ల్ ఫ్రెండ్ విషయంలో భార్యకు సారీ చెప్పిన ప్రభాకర్


నటుడు ప్రభాకర్ గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. బ్లాక్ అండ్ వైట్ డేస్ నుంచి డిడిలో ప్రసారమైన ఋతురాగాల టైం నుంచి ప్రభాకర్ అందరికీ చిరపరిచితుడే. అలాంటి ప్రభాకర్ తన లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి  ఆదివారం స్టార్ మా ఛానల్ లో ప్రసారం కానున్న 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' లో చెప్పారు. ''తెలిసీ తెలియక చాలా బాధ పెట్టిన సందర్భం ఒకటి ఉంది.

నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది. ఆ విషయంలో నా భార్య చాలా బాధ పడింది. ఆ సందర్భాన్ని ఎలాగో నేను సరి చేసుకుని మనస్ఫూర్తిగా సారీ చెప్పాను. నేను సారీ చెప్పడం పెద్ద గొప్ప గుణం కాదు. తను క్షమించడం గొప్ప విషయం'' అంటూ తన భార్య మలయజ గురించి గొప్పగా చెప్తూనే బుగ్గపై షోలోనే ఒక ముద్దిచ్చారు. ఈ ఆదివారం షోలో కొంత మంది జంటల్ని ఇన్వైట్ చేసింది శ్రీముఖి..వాళ్ళల్లో ప్రభాకర్, మలయజ ఒక పెయిర్. ఐతే వాళ్ళ పెళ్లి ఫొటోస్ ని వెనక స్క్రోలింగ్ లో వేస్తూ ఉండగా ప్రభాకర్ పెళ్లి ఫోటో చూసి అసలు విషయం చెప్పాడు.

తమ పెళ్లి ఆర్య సమాజ్ లో జరిగిందని అక్కడ తమకు సంబందించిన వాళ్ళెవరూ లేరని, దొంగ పెళ్లి అంటూ స్నేహితులు, తెలిసిన వాళ్ళ సమక్షంలో పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు పరభాకర్. ఖమ్మం నుంచి వచ్చిన తన ఫ్రెండ్  కన్యాదానం చేశారని వివరించారు. ఇక ఎవరెవరు వాళ్ళ వాళ్ళ పెళ్లిళ్ల గురించి ఎలాంటి న్యూస్ బయటకు చెప్పారో తెలియాలంటే ఈ షో చూడాల్సిందే. ఆపరేషన్ ధుర్యోధన లాంటి మూవీస్ కూడా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బుల్లితెరపై వరస సీరియల్స్ చేస్తూ బిజీ అయిపోయాడు.  వదినమ్మ సీరియల్ తో మంచి పేరుతెచ్చుకున్నారు ప్రభాకర్.