English | Telugu

రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ లో పల్లవించిన రామభక్తి!


నిన్న అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకని చూడటానికి నేషనల్ లెవెల్ లోని మంత్రులు, ముఖ్యమంత్రులు హాజరయ్యారు. వీరితోపాటు దానికి హిందీ, తెలుగు, తమిళ్ ఇలా సినిమా ఇండస్ట్రీలోని సినీతారలంతా వెళ్ళారు. కాగా అక్కడికి వెళ్ల లేని కొందరు సెలెబ్రిటీలు ఇక్కడ గుడిలోకి వెళ్లి ‌రాముడికి పూజలు చేసి, కాషాయ బెండాలని ఇళ్ళకి,‌ బైక్ లకు కట్టుకొని తమ భక్తిని చాటుకున్నారు. బిగ్ బాస్ సీజన్ సెవెన్ విజేత పల్లవి ప్రశాంత్ కూడా తన భక్తిని చాటుకున్నాడు.

మొన్నటికి మొన్న రచయిత , యాక్టర్, దర్శకుడు తనికెళ్ళ భరణి గారిని కలిసిన పల్లవి ప్రశాంత్.. తాజాగా అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠని పురస్కారించుకొని తనకు రాముడిపై ఉన్న భక్తిని చాటుకున్నాడు. కాషాయ వస్త్రాలు ధరించి , తన వెనకాల కాషాయ‌ జెండాలు‌ ఉండి రాముడిని వేడుకుంటున్నట్టుగా ఉన్న ఈ ఫోటోని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా దీనికి విపరీతమైన వీక్షకాధరణ లభిస్తుంది. అత్యధిక సంఖ్యలో చూడటమే కాదు అత్యధికంగా కామెంట్లు వస్తున్నాయి. జై శ్రీరామ్.. సియా రామ్ అంటూ భక్తులు కామెంట్లలోనే రాముడిపై భక్తిని తెలియజేస్తున్నారు.

బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కామన్ మ్యాన్ క్యాటగిరీలో రైతుబిడ్డగా అడుగుపెట్టి తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. రైతుబిడ్డ అంటే తగ్గేదేలా అన్నట్టుగా హౌస్ లో ఓ యుద్ధమే చేశాడు. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్‌ ఉండగా అందరు సెలబ్రిటీలే వారందరిని వెనక్కి నెట్టి.. బిగ్ బాస్ విజేతగా నిలిచాడు. ఇక విన్నర్ అయిన తరువాతి రోజే పల్లవి ప్రశాంత్ అరెస్ట్ కావడం.. ఆ తరువాత బెయిల్‌పై విడుదల కావడం.. ఇవన్నీ ప్రశాంత్‌ని వార్తల్లో హెడ్ లైన్స్ లో‌ నిలిచేలా చేసాయి. ప్రస్తుతం ఇంటికెళ్ళి అమ్మనాన్నలతో‌ కలసి సమయం గడుపుతున్నాడు. మొన్న ఓ టీవీ కార్యక్రమంలో‌ సీరియల్ బ్యాచ్ వర్సెస్ స్పై బ్యాచ్ గా సాగింది. దాంట్లో శివాజీకి ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ అని ఇచ్చాడు. ఆ తర్వాత 90's వెబ్ సిరీస్ సక్సెస్ మీట్ లో శివాజీ గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు.‌ ఇలా రెగ్యులర్ గా ఏదో ఒక ప్రోగ్రామ్ లో‌ కన్పిస్తున్నాడు ప్రశాంత్.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.