English | Telugu

సినిమాల్లో ఎంట్రీపై క్లారిటీగా ఉన్న‌ డాక్ట‌ర్ బాబు!

బుల్లితెరపై అత్యధిక రేటింగులతో నెంబర్ వన్ స్థానంలో దూసుకుపోతోంది 'కార్తీకదీపం' సీరియల్. ఈ సీరియల్ లో హీరోగా నటిస్తోన్న డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాలకు బీభత్సమైన క్రేజ్ వచ్చింది. సినిమా హీరోలనైనా గుర్తు పడతారో లేదో కానీ డాక్టర్ బాబుకి మాత్రం చిన్న పిల్లల దగ్గర నుండి ముసలివాళ్ల వరకు అందరూ అభిమానులే. ఎందుకంటే ప్రతీ ఇంట్లో 'కార్తీకదీపం' సీరియల్ ను చూసేవాళ్లు ఉన్నారు.

బుల్లితెరపై స్టార్ అనిపించుకున్న డాక్టర్ బాబు.. త్వరలోనే వెండితెరపై అడుగుపెట్టబోతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిరుపమ్ టాలీవుడ్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. సినిమాల్లో చేయాలనే ఉందని.. 'కార్తీకదీపం' సీరియల్ వచ్చినట్లే.. సినిమాల్లో మంచి పాత్రలు వస్తే తప్పకుండా చేస్తానని అన్నారు. కొన్ని క్యారెక్టర్లు వస్తున్నాయని.. కానీ తనకు సరిపోయే పాత్రను ఎంపిక చేసుకోవడానికి కాస్త టైం పడుతుందని అన్నారు.

ఎలాంటి పాత్రలను ఎన్నుకోవాలనే విషయంలో డైలమాలో ఉన్నానని చెప్పారు. ఇప్పటివరకు తనను సీరియల్స్ లో ఫ్యామిలీ ఓరియెంటెడ్ హీరోగానే చూశారని, ఇక సినిమాలంటే దానికి ఫిట్ అవుతానో లేదో ఆలోచించి అడుగులువేస్తున్నట్లు చెప్పారు. కమర్షియల్ సినిమాలు కాకుండా.. సబ్జెక్ట్ ఓరియెంటెడ్ కథల్లో చేయాలని ఉందని తెలిపారు. ఇక హీరోల్లో మహేష్ బాబు అంటే చాలా ఇష్టమని.. అలానే వెంకటేష్ గారి సినిమాలు ఎక్కువగా చూస్తుంటానని అన్నారు. కానీ తన ఆల్ టైం ఫేవరెట్ మాత్రం చిరంజీవి గారే అని చెప్పుకొచ్చారు.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...