English | Telugu
గుప్పెడంత మనసులో కొత్త ట్విస్ట్.. దేవయాని కపటనాటకం తెలిసిపోయిందా!
Updated : Sep 24, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -876 లో.. రిషి గురించి అలోచించి దేవయాని కళ్ళు తిరిగి పడిపోయినట్లు యాక్ట్ చేస్తుంది. రిషిని తీసుకొని రండి. నాకు రిషిని చూడాలని ఉంది వెళ్లి తీసుకొని రండి అని జగతితో దేవయాని అంటుంది.
ఆ తర్వాత ఫణింద్ర.. వెళ్లి రిషి నీ తీసుకొని రండి అని జగతి మహేంద్రలకి చెప్తాడు. రిషి రాడు చాలా సార్లు రమ్మని రిక్వెస్ట్ చేసిన రిషి రావడానికి ఇష్టపడడం లేదని జగతి చెప్తుంది. అసలు మీకే రిషి ఇంటికి రావడం ఇష్టం లేదనుకుంటా, అందుకే ఇలా చేస్తున్నారని శైలేంద్ర అనగానే.. మహేంద్ర కోప్పడి వెళ్ళిపోతాడు. కావాలనే ఫణీంద్ర ముందు దేవయాని.. ఇప్పుడు మనం ఏం అన్నామని మహేంద్ర అంత ఎత్తుకు లేస్తునాడని అంటుంది. మరొక వైపు రిషి కోసం వసుధార కాలేజీ లో వెయిట్ చేస్తుంటుంది. రిషి వచ్చి మీరు నా గురించి ఎక్కువ శ్రద్ద తీసుకుంటున్నారు. తగ్గించుకుంటే చాలా మంచిదని రిషి అంటాడు. పాండియన్ మన గురించి అడిగాడని వసుధార చెప్పగానే.. మీరు చేసే దాన్ని బట్టి ఎవరికైనా డౌట్ వస్తుందని రిషి అంటాడు. పాండియన్ మనల్ని అపార్థం చేసుకోడు అర్థం చేసుకుంటాడని వసు అంటుంది. నీకెలా తెలుసని రిషి అడుగుగ.. అతని వయసు అలాంటిది. తెలుసుకోవాలన్న ఆసక్తి తప్ప, తప్పుగా అనుకోడని రిషితో వసుధార అంటుంది. ఆ తర్వాత రిషికి మహేంద్ర ఫోన్ చేసి.. వాళ్ళు చేసిన తప్పుకి నాకు శిక్ష వేస్తున్నావ్. ఇంటికి రా నీకోసం పెద్దనాన్న బెంగపెట్టుకున్నాడని అంటాడు. నేను రాలేనని రిషి చెప్తాడు. ఆ తర్వాత ఫణీంద్రకి రిషి వీడియో కాల్ చేస్తాడు. నువ్వు ఇంటికి రా అని రిషిని రిక్వెస్ట్ చేస్తాడు ఫణీంద్ర. అయిన నేను రానని ఫణింద్రకి రిషి చెప్తాడు.
ఆ తర్వాత దేవయాని నటిస్తూ.. నువ్వు రా రిషి లేకుంటే, నేనే నీ దగ్గరికి వస్తానటూ అనగానే.. అలా అనకు పెద్దమ్మ, నువ్వు ఇంట్లోనే ఉండాలని రిషి అంటాడు. మరొక వైపు నువ్వు వెళ్ళు జగతి. నాకు వేరే పని ఉందని జగతిని కాలేజీకీ పంపిస్తాడు మహేంద్ర. జగతి తో పాటుగా కారులో శైలేంద్ర కూడా వెళ్తాడు. మళ్ళీ ఎప్పటిలాగే కాలేజీని సొంతం చేసుకుంటానంటూ శైలేంద్ర అనగానే.. జగతి వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
