English | Telugu

బిగ్ బాస్ 8 గేమ్ చెంజర్ ...నీ పొట్టెక్కడ భయ్యా 

జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ దాదాపు జబర్దస్త్ లో పదేళ్లుగా కామెడీ స్కిట్స్ చేస్తూ ఆడియన్స్ ని నవ్విస్తూ వస్తున్నాడు. అలాంటి అవినాష్ కమెడియన్ గా మాత్రమే కాదు అటు బిగ్ బాస్ కి వెళ్లి కూడా ఎంటర్టైన్ కూడా చేసాడు. బుల్లితెర మీద అవినాష్ హోస్ట్ శ్రీముఖి ఇద్దరూ జిగిరీ దోస్తులు. ఐతే అవినాష్ ముందుగా బిగ్‌బాస్ సీజ‌న్ 4లో పార్టిసిపేట్ చేసి త‌న‌దైన రీతిలో న‌వ్వించి ఆక‌ట్టుకున్నాడు. ఇక హౌస్ నుంచి వచ్చాక శ్రీదేవి డ్రామా కంపెనీ, ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఇతరత్రా షోస్ లో కనిపిస్తూ వస్తున్నాడు. అలాగే యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ గా వీడియోస్ చేస్తున్నాడు. అలాంటి అవినాష్ కి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ సీజన్ 8 లోకి అవకాశం వచ్చింది. దాంతో తన సత్తా నిరూపించుకోవడానికి వెళ్ళాడు. గేమ్ కూడా బాగా ఆడాడు. బిగ్ బాస్ సీజన్ 4 లో రానంత గుర్తింపు ఈ సీజన్ లో వచ్చింది. టాప్ 5 లో నిలబడ్డాడు.

ఐతే ఏ సీజన్ లో ఐనా కానీ హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్స్ అంతా మంచి వెయిట్ గైన్ తో బాగా దిట్టంగా వెళ్తారు ఇక హౌస్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు సన్నగా మల్లెతీగల్లా వెయిట్ లాస్ అవుతూ వస్తూ ఉంటారు. ఈ సీజన్ లో ఆ వెయిట్ లాస్ అనేది కంటెస్టెంట్స్ లో బాగా కనిపించింది. నిఖిల్, ప్రేరణ, యాష్మి, అవినాష్ వీళ్లంతా బాగా వెయిట్ లాస్ అయ్యారు. ఇక అవినాష్ లో ఆ చేంజ్ బాగా కనిపిస్తోంది. రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో కొన్ని పిక్స్ పెట్టాడు అవినాష్. హౌస్ లోకి వెళ్లే ముందు వరకు భారీ పొట్టతో కనిపించిన అవినాష్ కి ఇప్పుడు పొట్ట బాగా తగ్గిపోయింది. ఇక నిఖిల్ ముఖంలోనూ చేంజ్ వచ్చింది. సన్నగా పీక్కుపోయినట్టుగా ఐపోయింది. ఇక ప్రేరణ ఫేస్ లో ఆ చేంజ్ బాగా కనిపించింది. ఐతే అవినాష్ పిక్స్ చూసిన నెటిజన్స్ ఐతే వీరలెవెల్ లో కామెంట్స్ చేస్తున్నారు. "వ్వాహ్ అన్నా ..నో పొట్టా...టిప్పుటాపుగా ఉన్న కమెడియన్..ఇలాగే బాడీని జిమ్ కి వెళ్లి మెయింటైన్ చెయ్యి..మళ్ళీ కామెడీ వైపు రావొద్దు...యాంకర్ గా కానీ హీరోగా కానీ చెయ్యి..బిగ్ బాస్ కి కింగ్ అన్నా నువ్వు. ఈ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయండి..ఈయనేంటి రోజురోజుకూ మోడల్ గా మారిపోతున్నాడు..అతను గేమ్ ఛేంజర్ ... ఎంటర్టైన్మెంట్ కి హీరో" అంటూ చెప్తున్నారు.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.