English | Telugu

నయని పావని కోసమే రతికని పంపించేశారా?

బిగ్ బాస్ సీజన్-7 ఉల్టా పల్టా థీమ్ తో ఆకట్టుకుంటుంది. రోజుకో మలుపుతో ప్రేక్షకులకు ఉత్కంఠని రేకెత్తిస్తున్నాడు బిగ్ బాస్. ఆదివారం నాడు 2.0 గా 5 మంది హౌజ్ మేట్స్ ని లోపలికి తీసుకొచ్చాడు బిగ్ బాస్.

ఇప్పటికే బిగ్ బాస్ అయిదువారాలు పూర్తిచేసుకోగా.. కిరణ్ రాథోడ్, షకీల, దామిణి, రతిక, శుభశ్రీ ఎలిమినేట్ అయ్యారు. అయితే బిగ్ బాస్ హౌజ్ లో గ్లామర్ రోల్ ని పెంచడానికి 2.0 లో పూజామూర్తి, నయని పావని, అశ్విని శ్రీ లని తీసుకొచ్చాడు బిగ్ బాస్.

దీంతో ప్రస్తుతం హౌజ్ లో గర్ల్స్ తో కళకళలాడుతుందనే చెప్పాలి. అయితే ఈ ముగ్గురిలో నయని పావనికి ఇన్ స్టాగ్రామ్ లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే నయని పావని మొదట్లో టిక్ టాక్ స్టార్. టిక్ టాక్ లో తన డ్యాన్స్, హావభావాలతో అత్యధిక ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. అయితే టిక్ టాక్ ఆపేశాక ఇన్ స్టాగ్రామ్ కి వచ్చేసింది ఈ భామ. అయితే సీరియల్ బ్యాచ్ లోని ప్రియాంక జైన్, శోభా శెట్టి పెద్దగా గ్లామర్ ని చూపించకపోవడంతో ప్రేక్షకులు నయని పావని వైపు చూస్తున్నారని తెలుస్తుంది. అయితే రతిక బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నన్ని రోజులు తనకోసం చూసిన ప్రేక్షకులు.. ఇప్పుడు నయని పావని కోసం చూస్తారు.

హౌజ్ లో రతిక ఉన్నన్ని రోజులు అక్కడివి ఇక్కడ, ఇక్కడివి అక్కడ చెప్పి నెగెటివ్ అయింది. లేకుంటే తను టాప్-5 లో ఉండేదనే విమర్శకులు భావిస్తున్నారు. అయితే ఇప్పుడు నయని పావని హౌజ్ లోకి వచ్చి రాగానే పొట్టి పొట్టి డ్రెస్ లతో ఆకట్టుకుంటుంది. అయితే రతికని ఎలిమినేట్ చేయడానికి కారణం నయని పావనినే అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

ఎందుకంటే రతిక తన ఆటతీరు, మాటతీరుతో విపరీతమైన నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. నామినేషన్లో లీస్ట్ లో ఉన్న రతిక ఎలిమినేట్ అయింది. ఆయితే తన స్థానంలో గ్లామర్ రోల్ ని భర్తీ చేయడానికి భారీ రెమ్యునరేషన్ తో నయని పావనిని బిగ్ బాస్ తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. మరి ఈ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ బిగ్ బాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటందో లేదో చూడాలి మరి.