English | Telugu

నాగ్ తో ముచ్చట్లు పెట్టిన టేస్టీ తేజ వాళ్ళ అమ్మ

ఈ వారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని స్టార్ మాలో "మా ఇంటి పండగ" పేరుతో మంచి షో ప్రసారమయ్యింది. ఇందులో టేస్టీ తేజ వాళ్ళ అమ్మకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు. తేజ బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ అన్న విషయం తెలిసిందే. ఐతే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేవరకు కూడా తాను ఒక్కసారి కూడా వాళ్ళ అమ్మను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకెళ్లలేకపోయానే అని ఫీలవుతున్నాడు. వాళ్ళ అమ్మ కూడా అలాగే ఫీలయ్యిందట. ఐతే ఆ విషయాన్ని బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునకు చెప్పేసరికి మంచి అకేషన్ లో కలుద్దాం అన్నారట. ఇప్పుడు తనను కలవడానికి వచ్చి ప్రత్యేకంగా కలిసి వెళ్లిపోయారని తేజ చెప్పాడు. షోకి తీసుకెళ్లలేకపోయినా నాగ్ సర్ ని కలవడం తనకు ఎంతో సంతోషంగా అనిపించింది అని అది కూడా ఉగాది రోజున కలవడం ఇంకా సంతోషంగా ఉందన్నారు.

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి ఒక చీర కొనుక్కుందట వాళ్ళ అమ్మ కానీ హౌస్ లోకి వెళ్లే ఛాన్స్ రాకపోవడంతో కట్టుకోలేకపోయిందని కానీ ఇప్పుడు కట్టుకుంది అని నాగార్జునకు చెప్పి ఎంటర్టైన్ చేసాడు. బిగ్ బాస్ ఐపోయి నాలుగు నెలలు గడిచిపోయినా స్టార్ మా వాళ్ళు ఇలా నాగార్జున గారిని కలిసే ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ఇలాంటి పెద్ద గిఫ్ట్ అమ్మకు ఇవ్వలేను అని చెప్పాడు తేజ. "టేస్టీ తేజకు అమ్మైనందుకు మీకు ఎంత ఆనందంగా ఉంది" అని శ్రీముఖి అడిగేసరికి "వాడేమన్నా రవితేజనా, వరుణ్ తేజానా ఆనంద పడడానికి జస్ట్ టేస్టీ తేజ" అని తేజ వాళ్ళ అమ్మ చెప్పిన ఆన్సర్ కి అందరూ నవ్వేశారు. తేజ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతూ ఉంటాడు. బిగ్ బాస్ హౌస్ కి వెళ్లొచ్చాక బాగా ఫేమస్ ఐపోయాడు. మూవీ ప్రొమోషన్స్ తో ఫుల్ బిజీ ఉన్నాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.