English | Telugu

తన మనసులో ఎప్పటికి కృష్ణే ఉంటుందని చెప్పిన మురారి!

స్టార్ మా టీవీలో‌ ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్‌లో ముకుంద గదిలోకొ రేవతి వస్తుంది. నువ్వు చేసేది తప్పని నీకు అనిపించడం లేదా అని ముకుందని రేవతి అడుగుతుంది. అదేం లేదని నేను నా ప్రేమ కోసమే ఇదంతా చేస్తున్నానని, వాళ్ళిద్దరు అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి మనకి చెప్పకుండా ఇన్ని రోజులు మోసం చేశారు కదా వాళ్ళు చేసిందే తప్పని, ముకుంద వెడ్స్ మురారి ఇదే జరుగుతుందని, రేవతితో ముకుంద అంటుంది.

ఆ తర్వాత మురారి ఇంటికి రాగానే భవాని ఒక్కడివే వచ్చావేంటని అడుగుతుంది. చాలా సీరియస్ కేస్ అని అర్జెంట్ అని వెళ్ళిందని అంటాడు. పక్కనే ఉన్న మధు.. కృష్ణ ఇంట్లోనే ఉందని, అప్పడే వస్తున్న కృష్ణని చూపిస్తాడు‌ మధు. ఆ తర్వాత మంచి లవ్ స్టోరీ రాశానని మధు అనగానే.. ఓకే కంగ్రాట్స్ అని కృష్ణ అంటుంది. ఆ తర్వాత ముకుంద వచ్చి.. భోజనం రెడీ అయింది, మురారి నువ్వు ఫ్రెష్ అయి వస్తే వడ్డిస్తానని ముకుంద అంటుంది. ఏంటి ముకుంద వంట చేసిందా అని కృష్ణ అనుకుంటుంది. కృష్ణకి ఏదో ఆపరేషన్ ఉందన్నావని భవాని అడుగుతుంది. ఏసీపీ సర్ కాల్ చేశారు. కానీ నేను ఆపరేషన్ తర్వాత ఒక బర్త్ డే పార్టీకి వెళ్ళాలనిపించలేదు‌. ఏసీపీ సర్ కి కాల్ చేసి చెప్పలేదని కృష్ణ అంటుంది. వీళ్ళిద్దరిలో ఎవరు నిజం చెప్తున్నారని కృష్ణ అనుకుంటుంది. ఏసీపీ సర్ ని ప్రేమించి, ఆదర్శద్ కోసం ఇవన్నీ ముకుంద చేస్తుందా అని కృష్ణ అనుకొని.. నిజమేనా ముకుంద అంటుంది. ఏసీపీ సర్ ఫ్రెష్ అవుదురు రండి అని తోసుకెళ్తుంది కృష్ణ. మరొకవైపు ముకుంద గదిలోకి అలేఖ్య వెళ్తుంది. నీ స్పీడ్ చూస్తుంటే భయమేస్తుందని అలేఖ్య అంటుంది. నీ విషయం బయటపడకుండా, సింపుల్ గా పెద్దత్తయ్య వాళ్ళు ఒప్పుకుంటే బాగుండు కదా, నాకు భయమేస్తుందని అలేఖ్య అంటుంది. నమ్మకం ఉన్న చోట భయం ఉండకూడదని ముకుంద అంటుంది.

కృష్ణ, మురారి గదిలో మాట్లాడుకుంటారు. తను మౌనంగా బాధపడుతుంది. ఏంటని మురారి అడుగుతాడు. నేను అడిగే ప్రశ్నలకు మీరు సూటిగా నిజాలు చెప్పలేరని కృష్ణ అంటుంది. ఆ తర్వాత మధు, అలేఖ్య ఇద్దరు ఎప్పటిలాగే రీల్స్ చేస్తూ గొడవపడుతుంటారు. కాసేపటికి అందరూ భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. అప్పుడు ముకుంద యాక్టివ్ గా పనిచేయడం చూసిన భవాని.. ఇంటి బాధ్యతలు తీసుకున్నాక ముకుందలో చాలా మార్పు వచ్చింది కదా రేవతి అని భవాని అంటుంది. అవునక్క ఈ మధ్య కొంచెం స్పీడ్ పెంచిందని రేవతి అంటుంది. స్పీడ్ అంటే ఏంటని భవాని అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.