English | Telugu

మా ఊరి దేవుడు వచ్చేస్తున్నాడు!

మల్లెమాల టీమ్ ప్రతీ పండగను కాష్ చేసుకోవడంలో తన మార్క్ చూపిస్తూనే ఉంటుంది. అంతే కాదు తన ఆడియన్స్ ని మెప్పిస్తూ ఉండేందుకు రకరకాల ప్లాన్స్ వేస్తుంది కూడా. కొంతకాలం క్రితం వరకు మల్లెమాల మీద ఎన్నో ఆరోపణలు వచ్చినా వాటిని కాదని తన దారిలో తాను పోతోంది. ప్రతీ పండగకు కొత్తగా ఆలోచిస్తూ చేసే కార్యక్రమాలు చాలా కలర్ ఫుల్ గా జోష్ ఫుల్ గా ఉంటాయి. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా వినాయక చవితి స్పెషల్ ప్రోమో రిలీజ్ చేసింది మల్లెమాల. "మా ఊరి దేవుడు" పేరుతో చేసిన ఈ ఈవెంట్ చేశారు.

ఈ ప్రోమోలో నాగినీడు, ఖుష్బూ, అన్నపూర్ణ, జయసుధ, ప్రగతి, ప్రదీప్, రష్మీ ఇలా ఎంతో మంది కనిపించబోతున్నారు. ఇక ఇప్పుడు ఈ ప్రోమోలో కమెడియన్స్ అంత అవుట్ డోర్ షూటింగ్ చేశారు. పిచ్చి వాళ్ళుగా నటిస్తూ ప్రాంక్స్ చేసినట్టుగా కనిపిస్తోంది. అలాగే ఆది, రాంప్రసాద్, గెటప్ శీను అందరూ దుమ్ము రేపే పెర్ఫార్మెన్సులు ఇచ్చారు. డాన్స్ లతో స్టేజిని ఇరగదీసేసారు. ఇంద్రజ డాన్స్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఇక ఈ ఈవెంట్ ప్రోమో చూస్తుంటే ఫుల్ ఎంటర్టైన్ చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది. ఇక ఈ షోని ప్రదీప్ మాచిరాజు హోస్ట్ చేస్తున్నట్టుగా నాగినీడుతో చెప్పేస్తుంది మల్లెమాల టీమ్. ఇలా ఈ వినాయక చవితి షో మస్త్ ఎంటర్టైన్ చేయనుంది ఆడియన్స్ని.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.